Roja: రోజా విమర్శలకు కౌంటర్ ఇచ్చిన మంత్రి వాసంశెట్టి సుభాష్

Minister Vasamsetti Subhash Counters Rojas Remarks on Tirumala Darshan
  • తిరుమలలో డబ్బున్న వాళ్లకే ప్రాధాన్యత ఇస్తున్నారన్న రోజా
  • గతంలో సిఫారసు లేఖపై 100 మందికి దర్శనం చేయించిన ఘనత మీదే అంటూ వాసంశెట్టి రిప్లయ్
  • మీరు నీతులు చెప్పడం విడ్డూరంగా ఉందని విమర్శలు 
తిరుమలలో సామాన్య భక్తుల దర్శనాలను తగ్గించి బ్రేక్ దర్శనాల సంఖ్యను పెంచారని, ఇదేనా సనాతన ధర్మం? అంటూ మాజీ మంత్రి, వైసీపీ నేత రోజా విమర్శనాస్త్రాలు సంధించిన సంగతి తెలిసిందే. డబ్బున్న వాళ్లకే ప్రాధాన్యత ఇస్తున్నారంటూ ఆమె ధ్వజమెత్తారు. దీనిపై మంత్రి వాసంశెట్టి సుభాష్ స్పందించారు. 

అధికారంలో ఉన్నప్పుడు శ్రీవారి దర్శనం టికెట్లు అమ్ముకున్న వాళ్లు ఇప్పుడు నీతులు చెప్పడం విడ్డూరంగా ఉందని చురక అంటించారు. ఒక్కో సిఫారసు లేఖ మీద 100 మందికి దర్శనాలు చేయించిన ఘనత మీది కాదా? అని రోజాను ప్రశ్నించారు. తిరుమల లడ్డూని కూడా వదలకుండా అన్ని రకాలుగా అపవిత్రం చేసిన మీరు ఇప్పుడు నీతులు మాట్లాడడం దెయ్యాలు వేదాలు వల్లించడమే రోజా గారూ అంటూ  మంత్రి వాసంశెట్టి ధ్వజమెత్తారు.
Roja
Vasamsetti Subhash
Tirumala
Ttd Darshan
VIP Darshan
Andhra Pradesh Politics
YCP
BJP
Temple Politics
Srivari Darshan

More Telugu News