Rohit Sharma: కేకేఆర్ తో ముంబయి మ్యాచ్... సబ్ స్టిట్యూట్ గా రోహిత్  శర్మ

Rohit Sharma as Impact Substitute in Mumbai Indians vs KKR Match
  • వాంఖెడే స్టేడియంలో మ్యాచ్
  • టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకున్న ముంబయి ఇండియన్స్
  • ఇటీవల దారుణంగా ఆడుతున్న రోహిత్ శర్మ
ఐదు సార్లు ఐపీఎల్ ఛాంపియన్ గా నిలిచిన ముంబయి ఇండియన్స్ జట్టు తాజా సీజన్ లో ఇప్పటిదాకా గెలుపు బోణీ కొట్టలేదు. ఆడిన రెండు మ్యాచ్ ల్లోనూ ఓడిపోయింది. ఇవాళ ముంబయి జట్టు కోల్ కతా నైట్ రైడర్స్ తో ఆడుతోంది. 

సొంతగడ్డ వాంఖెడే స్టేడియంలో ఆడుతుండడం ముంబయి ఇండియన్స్ కు కలిసొచ్చే అంశం. టాస్ గెలిచిన ముంబయి సారథి హార్దిక్ పాండ్యా బౌలింగ్ ఎంచుకున్నాడు. ఈ మ్యాచ్ ద్వారా ముంబయి ఇండియన్స్ ఓ కొత్త ఆటగాడికి అవకాశం ఇస్తోంది. అశ్వనీ కుమార్ ఇవాళ అరంగేట్రం చేస్తున్నాడు. మరోవైపు విల్ జాక్స్ జట్టులోకి వచ్చాడు. 

ఆసక్తికరమైన అంశం ఏమిటంటే... ఇవాళ్టి మ్యాచ్ లో రోహిత్ శర్మ ఇంపాక్ట్ సబ్ స్టిట్యూట్ గా ఉన్నాడు. తుది 11 మంది జట్టులో హిట్ మ్యాన్ కు స్థానం లభించలేదు. ఇటీవల కాలంలో రోహిత్ శర్మ దారుణంగా ఆడుతున్న సంగతి తెలిసిందే. అతడిని ఇంపాక్ట్  సబ్ స్టిట్యూట్ ల జాబితాలో చేర్చారు.

అటు, కోల్ కతా జట్టులో ఒక మార్పు జరిగింది. మొయిన్ అలీ స్థానంలో సునీల్ నరైన్ జట్టులోకి వచ్చాడు.
Rohit Sharma
Mumbai Indians
KKR
IPL 2023
Impact Substitute
Hardik Pandya
Aswani Kumar
Will Jacks
Sunil Narine
Mumbai vs KKR

More Telugu News