Revanth Reddy: 400 ఎకరాల భూమిని కాపాడాలంటూ నిరసన.. హెచ్‌సీయూలో మరోసారి ఉద్రిక్తత

- కంచ గచ్చిబౌలిలోని భూమిని కాపాడాలంటూ విద్యార్థుల ధర్నా
- ప్రభుత్వానికి వ్యతిరేకంగా విద్యార్థుల నినాదాలు
- భూముల అమ్మకాన్ని నిలిపివేయాలని డిమాండ్
హైదరాబాద్ కేంద్రీయ విశ్వవిద్యాలయం (హెచ్‌సీయూ) వద్ద ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. కంచ గచ్చిబౌలిలోని 400 ఎకరాల భూమిని పరిరక్షించాలంటూ విద్యార్థులు పెద్ద సంఖ్యలో హెచ్‌సీయూ ప్రధాన ద్వారం వద్ద నిరసన చేపట్టారు. కాంగ్రెస్ ప్రభుత్వం మరియు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ, భూముల అమ్మకాన్ని నిలిపివేయాలని వారు డిమాండ్ చేశారు.
విశ్వవిద్యాలయం లోపలకి వెళ్ళేందుకు బీజేవైఎం, ఏబీవీపీ, వామపక్షాల నాయకులు ప్రయత్నించగా, పోలీసులు వారిని అడ్డుకొని ప్రధాన ద్వారాలు మూసివేశారు. ఆందోళనకారులను అదుపులోకి తీసుకున్న పోలీసులు, వారిని పోలీస్ స్టేషన్‌కు తరలించారు.