Yogi Adityanath: మోదీ రిటైర్మెంట్ తీసుకోబోతున్నారు... నెక్ట్స్ పీఎం యోగి... అనే వార్తలపై యోగి ఆదిత్యనాథ్ స్పందన

Yogi Adityanath Responds to Modi Retirement  Next PM Speculation
  • రాజకీయాలు తన ఫుల్ టైమ్ వృత్తి కాదన్న యోగి
  • తాను యోగిని మాత్రమేనని వ్యాఖ్య
  • పార్టీ వల్లే తాను ఇక్కడ ఉన్నానన్న యోగి
ప్రధాని నరేంద్ర మోదీ త్వరలోనే రాజకీయాల నుంచి రిటైర్ కాబోతున్నారంటూ కొన్ని రోజులుగా పెద్ద ఎత్తున ప్రచారం జరుగుతోంది. ఆరెస్సెస్ ప్రధాన కార్యాలయానికి మోదీ వెళ్లడం ఈ ప్రచారానికి మరింత బలం చేకూర్చినట్టయిందని పలువురు వ్యాఖ్యానిస్తున్నారు.. మోదీ తర్వాత యూపీ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ దేశ ప్రధాని అవుతారనే ప్రచారం కూడా జరుగుతోంది. 

ఈ వార్తలపై యోగి స్పందించారు. తాను యూపీకి ముఖ్యమంత్రినని... ఈ రాష్ట్రంలోని పేదలకు సేవ చేయడానికి పార్టీ తనను ఇక్కడ పెట్టిందని చెప్పారు. రాజకీయాలు తన ఫుల్ టైమ్ వృత్తి కాదని... యూపీలో తన పని తాను చేసుకుంటున్నానని తెలిపారు. తాను యోగిని మాత్రమేనని చెప్పారు. పార్టీ వల్లే తాను ఇక్కడ ఉన్నానని అన్నారు. కేంద్ర నాయకులతో విభేదాలు వస్తే తాను ఇక్కడ ఉండగలనా? అని ప్రశ్నించారు. ఎవరికి టికెట్ ఇవ్వాలనేది పార్టీ పార్లమెంటరీ బోర్డు నిర్ణయిస్తుందని చెప్పారు. టైమ్ పాస్ కోసం మాట్లాడేవాళ్ల నోళ్లను ఆపలేమని అన్నారు. 
Yogi Adityanath
Narendra Modi
Retirement
Next PM
UP CM
BJP
Indian Politics
Political Speculation
RSS

More Telugu News