KCR: రైల్ రోకో కేసు కొట్టి వేయాలని కేసీఆర్ పిటిషన్.. విచారణ చేపట్టిన హైకోర్టు

High Court Takes Up KCRs Petition on Telangana Rail Roco Case
  • తెలంగాణ ఉద్యమం సమయంలో కేసీఆర్‌పై రైల్ రోకో ఘటనలో కేసు నమోదు
  • 2011 అక్టోబర్ 15న సికింద్రాబాద్‌లో రైల్ రోకో
  • ప్రజాప్రతినిధుల కోర్టులో పెండింగులో ఉన్న కేసు
తెలంగాణ ఉద్యమం సమయంలో రైల్ రోకో ఘటనకు సంబంధించి నమోదైన కేసును కొట్టివేయాలంటూ బీఆర్ఎస్ అధినేత, మాజీ ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర రావు దాఖలు చేసిన పిటిషన్‌పై హైకోర్టులో విచారణ జరిగింది. తనపై నమోదైన కేసును కొట్టివేయాలంటూ కేసీఆర్ దాఖలు చేసిన పిటిషన్‌ను హైకోర్టు విచారించింది. 2011 అక్టోబర్ 15న ప్రత్యేక రాష్ట్ర ఉద్యమంలో భాగంగా సికింద్రాబాద్‌లో రైల్ రోకో చేపట్టారు.

అప్పట్లో కేసు నమోదు చేసిన పోలీసులు పలువురిని అరెస్టు చేశారు. ఈ కేసు ప్రస్తుతం ప్రజాప్రతినిధుల కోర్టులో పెండింగులో ఉంది. కేసీఆర్ పిలుపు మేరకే రైల్ రోకో చేపట్టారని పీపీ కోర్టుకు తెలిపారు.

రైల్ రోకో జరిగిన సమయంలో అక్కడ కేసీఆర్ లేరని ఆయన తరఫు న్యాయవాది కోర్టుకు తెలియజేశారు. వాదనలు విన్న న్యాయస్థానం రైల్ రోకో ఘటన గురించి ఫిర్యాదు చేసిన వ్యక్తికి నోటీసు ఇవ్వాలని ఆదేశించింది. తదుపరి విచారణను వాయిదా వేసింది.
KCR
K Chandrashekar Rao
Telangana Rail Roco Case
High Court Hearing
2011 Telangana Movement
Sikanderabad Rail Roco
Brs Party
Political Case
Indian Politics
Telangana High Court

More Telugu News