Chandrababu Naidu: అమరావతిలో సింగపూర్ బృందం .. నేడు సీఎం చంద్రబాబు, లోకేశ్‌తో భేటీ

Singapore Team Visits Amaravati Meets Chandrababu Naidu
  • ఏపీ ప్రభుత్వ ఆహ్వానంతో రాష్ట్రానికి వచ్చిన సింగపూర్ బృందం
  • అమరావతి ప్రాంతంలో నిర్మాణాలు పరిశీలించిన ప్రతినిధి బృందం
  • స్టార్టప్ ఏరియా ప్రాజెక్టు అభివృద్ధిలో మళ్లీ భాగస్వామ్యానికి అడుగులు 
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఆహ్వానం మేరకు సింగపూర్ ప్రతినిధి బృందం బుధవారం అమరావతికి విచ్చేసింది. రాజధాని ప్రాంతంలో నిర్మాణాలను ఈ బృందం పరిశీలించింది. ఈ రోజు ముఖ్యమంత్రి చంద్రబాబు, మంత్రి లోకేశ్‌ను సింగపూర్ బృందం కలిసి స్టార్టప్ ఏరియా అభివృద్ధి తదితర అంశాలపై చర్చించనుంది.

గతంలో తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉండగా అమరావతిలో స్టార్టప్ ఏరియా అభివృద్ధి చేసేందుకు సింగపూర్ ప్రభుత్వంతో ఒప్పందం కుదిరింది. 2017 మే నెలలో శంకుస్థాపన చేయడం జరిగింది. అయితే జగన్ హయాంలో ఈ ప్రాజెక్టును రద్దు చేయడంతో పాటు అమరావతి అభివృద్ధిని పక్కన పెట్టారు. మళ్లీ రాష్ట్రంలో చంద్రబాబు నేతృత్వంలో కూటమి అధికారంలోకి రావడంతో అమరావతిలో వివిధ ప్రాజెక్టుల పనులు ఊపందుకున్నాయి.

రాజధాని అభివృద్ధిలో భాగస్వామ్యం కావాలని సింగపూర్ ప్రభుత్వాన్ని చంద్రబాబు ఆహ్వానించడంతో స్టార్టప్ ఏరియా ప్రాజెక్టు అభివృద్ధికి మళ్లీ ముందుకొచ్చింది. 
Chandrababu Naidu
Singapore
Amaravati
Andhra Pradesh
Startup Area
Lokesh
Capital Development
TDP
Project Revival

More Telugu News