Roja: ఏ క్షణమైనా రోజాను అరెస్ట్ చేయొచ్చు: రవి నాయుడు

- ఆడుదాం ఆంధ్ర పేరుతో రోజా అవినీతికి పాల్పడ్డారన్న రవి నాయుడు
- రూ. 119 కోట్లను పక్కదోవ పట్టించారని ఆరోపణ
- అవినీతి బయటపడుతుందని రోజా భయపడుతున్నారని వ్యాఖ్య
మాజీ మంత్రి రోజా త్వరలోనే అరెస్ట్ కావడం పక్కా అని శాప్ ఛైర్మన్ రవి నాయుడు అన్నారు. ఆడుదాం ఆంధ్ర పేరుతో విచ్చలవిడిగా అవినీతికి పాల్పడ్డారని ఆరోపించారు. క్రీడా సామగ్రి కొనుగోళ్లలో రూ. 119 కోట్లకు పైగా నిధులను పక్కదోవ పట్టించారని చెప్పారు. తిరుమల టికెట్ల దందాలో కోట్ల రూపాయలు వెనకేసుకున్నారని విమర్శించారు. నగరి నియోజకవర్గంలో జరిగిన అక్రమాలపై ప్రస్తుతం విచారణ జరుగుతోందని చెప్పారు. విచారణలో తన అవినీతి ఎక్కడ బయటపడుతుందో అని రోజా భయపడుతున్నారని అన్నారు. రోజా అరెస్ట్ పక్కా అని... ఏ క్షణమైనా రోజాను అరెస్ట్ చేయవచ్చని చెప్పారు.