Hyderabad: హైదరాబాద్‌లోని పలు ప్రాంతాల్లో వర్షం... నగర జీవికి ఉపశమనం

Heavy Rainfall in Several Areas of Hyderabad
  • ఉక్కపోతతో ఇబ్బంది పడుతున్న నగరాన్ని పలకరించిన వరుణుడు
  • హిమాయత్ నగర్, కోఠి, అమీర్‌పేట తదితర ప్రాంతాల్లో వర్షం
  • నగరంలో పలుచోట్ల ట్రాఫిక్ జామ్
హైదరాబాద్ నగరంలో పలు ప్రాంతాల్లో ఓ మోస్తరు వర్షం కురిసింది. గత కొద్ది రోజులుగా ఉక్కపోతతో సతమతమవుతున్న ప్రజలకు వర్షం కాస్త ఉపశమనం కలిగించింది. హిమాయత్‌నగర్, కోఠి, అమీర్‌పేట, బోరబండ, జుబ్లీహిల్స్, ఎల్బీనగర్, హయత్ నగర్, మేడ్చల్, విద్యానగర్, అబిడ్స్ తదితర ప్రాంతాల్లో మోస్తరు నుంచి భారీ వర్షపాతం నమోదైంది.

వర్షం కారణంగా నగరంలో పలు చోట్ల ట్రాఫిక్ జామ్ ఏర్పడింది. ఖైరతాబాద్‌లోని మెర్క్యురీ హోటల్ వద్ద ఒక కారుపై చెట్టు కూలింది. ఈ సంఘటనలో కారు స్వల్పంగా దెబ్బతింది. కారులో ప్రయాణిస్తున్న ఇద్దరు మహిళలు సురక్షితంగా బయటపడ్డారు. ఇదిలా ఉండగా, తెలంగాణలోని పలు జిల్లాల్లో వడగండ్ల వాన పడే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం హెచ్చరించింది.
Hyderabad
Heavy Rainfall
Traffic Jam
Tree Falls on Car
Weather Update
Telangana
Hailstorm
Hyderabad Weather
Rain in Hyderabad
Monsoon Season

More Telugu News