USA: చైనీయులతో ప్రేమ, పెళ్లి, శారీరక సంబంధాలు వద్దు: అమెరికా

- చైనాలోని తమ ఉద్యోగులకు అమెరికా ఆదేశాలు
- చైనాలో అమెరికా మిషన్ కోసం పనిచేస్తున్న సిబ్బంది, అధికారులు, కాంట్రాక్టర్లకు వర్తింపు
- నిబంధనలు ఉల్లంఘిస్తే విధుల నుంచి తొలగిస్తామని స్పష్టీకరణ
చైనీయులతో ప్రేమ, పెళ్లి, శారీరక సంబంధాలు ఏర్పరుచుకోవద్దని అమెరికా చైనాలోని తమ ప్రభుత్వ అధికారులు, సిబ్బందిని హెచ్చరించింది. చైనాలో అమెరికా మిషన్ కోసం పనిచేస్తున్న సిబ్బంది, అధికారులు, కాంట్రాక్టర్లు, భద్రతాపరమైన అనుమతులున్న కుటుంబ సభ్యులకు ఈ నిషేధం వర్తిస్తుందని తెలిపింది. నిబంధనలు ఉల్లంఘించిన వారిని విధుల నుంచి తొలగిస్తామని తేల్చి చెప్పింది.
కాగా, చైనాలో అమెరికా రాయబారి నికోలస్ బర్న్స్ ఈ ఏడాది జనవరిలో తన బాధ్యతల నుంచి వైదొలగిన వెంటనే ఈ ఆదేశాలు వెలువడ్డాయి.
కాగా, చైనాలో అమెరికా రాయబారి నికోలస్ బర్న్స్ ఈ ఏడాది జనవరిలో తన బాధ్యతల నుంచి వైదొలగిన వెంటనే ఈ ఆదేశాలు వెలువడ్డాయి.