Hyderabad: కేపీహెచ్‌బీలో బాల‌య్య‌, మీనాక్షి చౌద‌రి సంద‌డి.. వారిని చూసేందుకు ఎగ‌బ‌డిన ఫ్యాన్స్‌

Balakrishna and Meenakshi Chaudhary Create a Stir in KPHB
  • కేపీహెచ్‌బీలో ఓ ప్రైవేట్ కార్య‌క్ర‌మానికి హాజ‌రైన హీరో, హీరోయిన్‌
  • ఇది తెలుసుకుని అక్క‌డికి చేరుకున్న వంద‌లాది మంది ఫ్యాన్స్‌
  • ఫొటోలు, వీడియోలు తీసుకునేందుకు పోటీప‌డ్డ వైనం 
హైద‌రాబాద్ న‌గ‌రంలోని కేపీహెచ్‌బీ కాల‌నీలో టాలీవుడ్ సీనియ‌ర్ హీరో నంద‌మూరి బాల‌కృష్ణ‌, స్టార్ హీరోయిన్ మీనాక్షి చౌద‌రి సంద‌డి చేశారు. శుక్ర‌వారం కేపీహెచ్‌బీలోని రోడ్డు నంబ‌ర్‌.01లో ఓ ప్రైవేట్ కార్య‌క్ర‌మానికి హాజ‌ర‌య్యారు. ఇది తెలుసుకున్న అభిమానులు వంద‌లాది మంది అక్క‌డికి చేరుకున్నారు. వీరి రాక‌తో ఆ ప్రాంగ‌ణం అంతా ర‌ద్దీగా మారింది. అభిమానుల‌కు అభివాదం చేస్తూ హీరో, హీరోయిన్ లోప‌లికి వెళ్లారు. దాంతో వారిని చూసేందుకు ఫ్యాన్స్ ఎగ‌బ‌డ్డారు. ఫొటోలు, వీడియోలు తీసుకునేందుకు పోటీ ప‌డ్డారు. 

Hyderabad
Nandamuri Balakrishna
Meenakshi Chaudhary
KPHB
Tollywood
Telugu Cinema
Celebrity Appearance
Fan Frenzy
Movie Stars

More Telugu News