Papua New Guinea: పపువా న్యూగినియాలో భారీ భూకంపం.. సునామీ హెచ్చరిక జారీ

Papua New Guinea Hit by Strong Earthquake Tsunami Warning Issued
   
ఓషియానా కంట్రీల్లో ఒకటైన పపువా న్యూ గినియాలో భారీ భూకంపం సంభవించింది. రిక్టర్ స్కేలుపై దాని తీవ్రత 6.9గా నమోదైంది. పశ్చిమ న్యూ బ్రిటన్ ప్రావిన్స్‌లోని కింబే పట్టణానికి 194 కిలోమీటర్ల దూరంలో, భూమికి 10 కిలోమీటర్ల లోతున భూకంప కేంద్రాన్ని గుర్తించారు. దీంతో అమెరికా జియోలాజికల్ సర్వే సునామీ హెచ్చరికలు జారీ చేసింది.  

కాగా, ఇటీవల మయన్మార్, థాయిలాండ్‌లలో 7.7 తీవ్రతతో సంభవించిన భారీ భూకంపం వేలాది మందిని బలితీసుకుంది. ఒక్క మయన్మార్‌లోనే మూడు వేలమందికి పైగా ప్రాణాలు కోల్పోయారు. వేలమంది గాయపడగా, మరికొందరు గల్లంతయ్యారు. ప్రస్తుతం అక్కడ సహాయక కార్యక్రమాలు కొనసాగుతున్నాయి.
Papua New Guinea
Earthquake
Tsunami Warning
USGS
6.9 Magnitude Earthquake
Pacific Ocean Earthquake
West New Britain
Natural Disaster
Seismic Activity

More Telugu News