Chandrababu Naidu: ప్రతి ఒక్కరినీ అడిగి మరీ కాఫీ సర్వ్ చేసిన సీఎం చంద్రబాబు... వీడియో ఇదిగో!

Chandrababu Naidu Serves Coffee to Villagers Watch Video
  • ఎన్టీఆర్ జిల్లాలో చంద్రబాబు పర్యటన
  • నందిగామ నియోజకవర్గం ముప్పాళ్లలో ఓ సాధారణ వ్యక్తి ఇంటికి వెళ్లిన సీఎం చంద్రబాబు
  • అందరితో  కలిసి కాఫీ తాగుతూ, వారి సమస్యలు అడిగి తెలుసుకున్న వైనం
ముఖ్యమంత్రి చంద్రబాబు ఇవాళ ఎన్టీఆర్ జిల్లా నందిగామ నియోజకవర్గం ముప్పాళ్లలో పర్యటించారు. ఓ సాధారణ వ్యక్తి ఇంటికి వెళ్లిన చంద్రబాబు... ఆ కుటుంబంతో మమేకం అయ్యారు. అంతేకాదు, ఆ ఇంట్లోని ప్రతి ఒక్కరినీ అడిగి మరీ కాఫీ అందించారు. 

పిల్లలను కూడా పలకరించి... కాఫీ తాగుతారా, అలవాటు లేదా? అని అడిగారు. హోంమంత్రి అనితకు, కలెక్టర్ కు సైతం చంద్రబాబు కాఫీ అందించారు. ఈ సందర్భంగా తాను కూడా కప్పు అందుకుని, అందరితో కలిసి కాఫీ తాగుతూ ఆస్వాదించారు. మీ సమస్యలు ఏంటో ఇప్పుడు చెప్పండి అంటూ అడిగి తెలుసుకున్నారు.
Chandrababu Naidu
Andhra Pradesh CM
NTR District
Nandyala
Muppa
Home Minister Anitha
Collector
Village Visit
Coffee with people
Public Interaction

More Telugu News