Elon Musk: యూఎస్ - యూరప్ దేశాల సుంకాలపై మస్క్ కీలక వ్యాఖ్యలు

Elon Musk on US EU Tariffs Hopes for Zero Tariffs in the Future
  • అనేక దేశాలపై ప్రతీకార సుంకాల మోత మోగించిన డొనాల్డ్ ట్రంప్
  • యూఎస్ – యూరప్ దేశాల మధ్య జీరో సుంకాలు చూడాలనుకుంటున్నట్లు మస్క్ వ్యాఖ్యలు
  • భవిష్యత్తులో ఇరుదేశాల మధ్య ఎలాంటి సుంకాలు ఉండవని మస్క్ ఆశాభావం
ప్రపంచవ్యాప్తంగా పలు దేశాలపై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రతీకార సుంకాల మోత మోగించిన విషయం విదితమే. ఈ తరుణంలో ప్రపంచ కుబేరుడు, టెస్లా అధినేత ఎలాన్ మస్క్ సుంకాలపై కీలక వ్యాఖ్యలు చేశారు.

ఇటలీ లీగ్ నాయకుడు మాటియో సాల్వినితో ముఖాముఖిలో ఎలాన్ మస్క్ మాట్లాడుతూ.. భవిష్యత్తులో యూఎస్ – యూరప్ దేశాల మధ్య సుంకాలు లేకుండా చూడాలని తాను కోరుకుంటున్నానన్నారు.

భవిష్యత్తులో అమెరికా – యూరప్ దేశాల మధ్య మరింత సన్నిహితమైన, బలమైన భాగస్వామ్యం ఏర్పడుతుందని, తద్వారా ఇరు దేశాల మధ్య ఎలాంటి సుంకాలు ఉండవని ఆశిస్తున్నానని మస్క్ పేర్కొన్నారు. ఇటలీతో సహా ఇతర యూరప్ దేశాలకు 20 శాతం సుంకాలు విధిస్తూ ట్రంప్ నిర్ణయం తీసుకున్న సంగతి తెలిసిందే. 
Elon Musk
US-EU Tariffs
Zero Tariffs
Donald Trump
Trade War
Elon Musk Comments
US-Europe Trade
Mattia Salvini

More Telugu News