Nakka Anand Babu: 'సాక్షి'లో తప్పుడు కథనాలు ప్రచురిస్తున్నారంటూ డీజీపీకి టీడీపీ నేతల ఫిర్యాదు

- డీజీపీని కలిసిన నక్కా ఆనంద్ బాబు, అశోక్ బాబు, బుచ్చి రాంప్రసాద్
- సాక్షిపై చర్యలు తీసుకోవాలని డీజీపీకి విజ్ఞప్తి
- మీడియా రంగంలో సాక్షి ఓ కలుపు మొక్క అన్న ఆనంద్ బాబు
- సాక్షి పుట్టుక నుంచే అసత్యాలు రాస్తోందంటూ ఫైర్
టీడీపీ నేతలు నక్కా ఆనంద్ బాబు, పరుచూరి అశోక్ బాబు, బుచ్చి రాంప్రసాద్ ఇవాళ రాష్ట్ర డీజీపీ హరీశ్ కుమార్ గుప్తాను కలిసి సాక్షి మీడియా సంస్థపై ఫిర్యాదు చేశారు. తప్పుడు కథనాలు ప్రచురిస్తున్న సాక్షిపై చర్యలు తీసుకోవాలని డీజీపీని కోరారు.
అనంతరం నక్కా ఆనంద్ బాబు మాట్లాడుతూ, మీడియా రంగంలో సాక్షి ఓ కలుపు మొక్క అని విమర్శించారు. సాక్షి మీడియా పుట్టుక నుంచే అసత్యాలు రాస్తోందని వ్యాఖ్యానించారు. పల్నాడు జిల్లాలో జరిగిన ఓ హత్యను తెలంగాణలో ఒకలా, ఏపీలో మరోలా ప్రచురించారని ఆనంద్ బాబు ఆరోపించారు. సాక్షి మీడియా రాజకీయ పబ్బం గడుపుకునే తీరుకు ఇదే నిదర్శనమని అన్నారు.
విద్వేషాలు రెచ్చగొడుతున్న సాక్షి మీడియాపై చర్యలు తీసుకోవాలని డీజీపీని కోరామని వెల్లడించారు. సాక్షి తప్పుడు కథనాలపై క్రిమినల్ కేసులు పెట్టాలని అన్నారు. ప్రజలు ఓడించినా సొంత మీడియా ద్వారా అసత్యాలు ప్రచారం చేస్తున్నారని ఆనంద్ బాబు మండిపడ్డారు.