Natty Subramaniam: ర్యాష్ డ్రైవింగ్ చేశారా అంతే .. ఓటీటీకి సైకలాజికల్ థ్రిల్లర్ !

Web Movie Update
  • 2023లో విడుదలైన సినిమా 
  • సైకాలాజికల్ థ్రిల్లర్ జోనర్లో సాగే కథ
  • ప్రధానమైన పాత్రను పోషించిన నట్టి సుబ్రమణియన్  
  • రేపటి నుంచి ఆహా తమిళ్ లో స్ట్రీమింగ్  

సైకలాజికల్ థ్రిల్లర్ జోనర్లో కోలీవుడ్ నుంచి ఎక్కువ సినిమాలు వస్తుంటాయి. అలా ప్రేక్షకుల ముందుకు వచ్చిన సినిమానే 'వెబ్'. మునివేలన్ నిర్మించిన ఈ సినిమాకి 'హరూన్' దర్శకత్వం వహించాడు. 2023 ఆగస్టు 4 వ తేదీన ఈ సినిమాను థియేటర్లకు తీసుకుని వచ్చారు. అలాంటి ఈ సినిమా, ఏడాదిన్నర తరువాత ఓటీటీకి వస్తోంది. 

రేపటి నుంచి ఈ సినిమా 'ఆహా' తమిళ్ లో స్ట్రీమింగ్ కానుంది. అందుకు సంబంధించిన అధికారిక ప్రకటన వచ్చేసింది. ఈ సినిమాలో నట్టి సుబ్రమణియన్  .. శిల్పా మంజునాథ్ .. రాజేంద్రన్ ప్రధానమైన పాత్రలను పోషించారు. కథ అంతా కూడా ఈ పాత్రల చుట్టూనే తిరగనుంది. నట్టి సుబ్రమణియన్ నటన ఈ సినిమాకి హైలైట్ అనే టాక్ ఆ సమయంలో బాగా వినిపించింది. ఈ సినిమాకి, కార్తీక్ రాజా సంగీతాన్ని సమకూర్చాడు.

కథలోకి వెళితే .. ఓ అయిదుగురు అమ్మాయిలు రేవ్ పార్టీలో ఫుల్లుగా తాగేసి ర్యాష్ డ్రైవింగ్ చేస్తూ వెళుతూ ఉంటే, ఓ కిల్లర్ వాళ్లను కిడ్నాప్ చేస్తాడు. ఓ పాడుబడిన బంగళాలో వాళ్లను బంధిస్తాడు. వాళ్లలో ఒకరిని అతను చంపిన తీరు చూసి మిగతావాళ్లు వణికిపోతారు. ర్యాష్ డ్రైవింగ్ చేసినవారిని అతను అలాగే చంపుతాడని తెలిసి కొయ్యబారిపోతారు. ర్యాష్ డ్రైవింగ్ కీ .. అతను అలా ప్రవర్తించడానికి కారణం ఏమిటి? ఆ నలుగురు అమ్మాయిలు అతని బారి నుంచి బయటపడగలుగుతారా? అనేది కథ. 

Natty Subramaniam
Silpa Manjunath
Rajendran
Web Tamil Movie
Kollywood Thriller
Psychological Thriller
Aha Tamil
OTT Release
Tamil Movie Streaming
Rash Driving

More Telugu News