Tahawwur Rana: భారత్‌కు తహవ్వుర్‌ రాణా అప్పగింత తొలి ఫొటో విడుదల

First Photo of Tahawwur Ranas Extradition to India Released
    
ముంబ‌యి ఉగ్ర‌దాడి 26/11 కేసులో ప్రధాన కుట్ర‌దారుల్లో ఒక‌డైన‌ తహవ్వుర్‌ హుస్సేన్‌ రాణాను భారత్‌కు తీసుకువచ్చిన విషయం తెలిసిందే. అమెరికా నుంచి అతడిని తీసుకువచ్చిన ప్రత్యేక విమానం గురువారం సాయంత్రం దేశ రాజ‌ధాని ఢిల్లీ ఎయిర్‌పోర్టుకు చేరుకుంది. వెంటనే రాణాను నేషనల్‌ సెక్యూరిటీ ఏజెన్సీ (ఎన్‌ఐఏ) అదుపులోకి తీసుకుంది.

అయితే, అమెరికాలో యూఎస్‌ మార్షల్స్ రాణాను భారత్‌కు అప్పగిస్తున్న తొలి ఫొటో బయటకు వచ్చింది. ఈ ఫొటోను అమెరికా న్యాయశాఖ తాజాగా విడుదల చేసింది. ప్రస్తుతం ఈ ఫొటో నెట్టింట‌ వైరల్‌ అవుతోంది. కాగా, 2009 నుంచి యూఎస్‌ జైలులో శిక్ష అనుభవిస్తున్న రాణాను ఆ దేశం బుధవారం అధికారికంగా భారత్‌కు అప్పగించింది. 
Tahawwur Rana
Tahawwur Hussain Rana
26/11 Mumbai Attacks
India-US extradition
NIA
National Security Agency
US Marshals
Terrorism
Extradition
Mumbai Terror Attacks

More Telugu News