KTR: కేటీఆర్ తుస్సుమనిపించారు: ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి వ్యంగ్యం

MP Chamala Kiran Kumar Reddy Slams KTR Over HCU Land Scam Allegations
  • 48 గంటల్లో వివరాలు బయటపెడతానన్న కేటీఆర్ ఏమీ చేయలేదని విమర్శ
  • ప్రభుత్వానికి మంచి పేరు వస్తుంటే జీర్ణించుకోలేకపోతున్నాడని ఆగ్రహం
  • కేటీఆర్ భూములు కాజేయాలనుకున్నాడని ఆరోపణ
హైదరాబాద్ కేంద్రీయ విశ్వవిద్యాలయం (హెచ్‌సీయూ) భూముల వ్యవహారం వెనుక రూ. 10 వేల కోట్ల కుంభకోణం ఉందని ఆరోపణలు చేసిన కేటీఆర్‌పై కాంగ్రెస్ ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. కంచ గచ్చిబౌలి భూముల కుంభకోణాన్ని 48 గంటల్లో బయటపెడతానని సవాల్ చేసిన కేటీఆర్, ఇప్పటి వరకు చేసిందేమీ లేదని అన్నారు.

కేటీఆర్ హైడ్రోజన్ బాంబు వేస్తే దాని వల్ల ఎన్ని ప్రాణాలు పోతాయో, దేశం ఎంత అల్లకల్లోలమవుతుందోనని ఆందోళన చెందామని, చివరకు ఉల్లిగడ్డ బాంబు కూడా వేయలేకపోయారని ఎద్దేవా చేశారు. అభివృద్ధి కార్యక్రమాలతో ప్రభుత్వానికి మంచి పేరు వస్తుంటే కేటీఆర్ జీర్ణించుకోలేకపోతున్నారని విమర్శించారు.

బిల్లీరావుతో కలిసి ఈ భూములను కేటీఆర్ కాజేయాలనుకున్నారని ఆరోపించారు. ఆ ప్రయత్నం విఫలం కావడంతో మీడియా సమావేశం ఏర్పాటు చేసి అసంతృప్తిని వెళ్లగక్కారని అన్నారు. ఎవరో ఒక ఎంపీ ఈ భూముల వ్యవహారం వెనుక ఉన్నాడని చెప్పిన కేటీఆర్, ఆ ఎంపీ పేరు మాత్రం చెప్పడం లేదని విమర్శించారు. తాను చెప్పాలనుకున్నది స్పష్టంగా చెప్పాలని, తెలంగాణ ప్రజలను గందరగోళానికి గురి చేయవద్దని సూచించారు.
KTR
Chamala Kiran Kumar Reddy
HCU land scam
Telangana Politics
Gachibowli land scam
10000 crore scam allegation
KTR allegations
Hyderabad
BJP
TRS

More Telugu News