Jr NTR: ఇట్స్ అఫిషీయల్... 'అర్జున్ S/O వైజయంతి' ప్రీ రిలీజ్ ఈవెంట్‌కు తారక్

- కల్యాణ్ రామ్, ప్రదీప్ చిలుకూరి కాంబోలో 'అర్జున్ S/O వైజయంతి'
- ఈ నెల 18న ప్రేక్షకుల ముందుకు రానున్న సినిమా
- రేపు ప్రీ రిలీజ్ ఈవెంట్ నిర్వహిస్తున్న మేకర్స్
- ఈ కార్యక్రమానికి హాజరుకానున్న జూనియర్ ఎన్టీఆర్
- సోషల్ మీడియా వేదికగా అధికారికంగా ప్రకటించిన మేకర్స్
నందమూరి కల్యాణ్ రామ్ హీరోగా ప్రదీప్ చిలుకూరి దర్శకత్వంలో తెరకెక్కిన తాజా చిత్రం 'అర్జున్ S/O వైజయంతి'. ఈ నెల 18న ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది. విడుదలకు ఇంకా వారం రోజులే ఉండడంతో మేకర్స్ ముమ్మరంగా ప్రచార కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. ఇందులో భాగంగా శనివారం నాడు (ఏప్రిల్ 12న) ప్రీ రిలీజ్ ఈవెంట్ నిర్వహిస్తున్నారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా జూనియర్ ఎన్టీఆర్ హాజరుకానున్నారు. ఈ విషయాన్ని నిర్మాణ సంస్థలు అశోక క్రియేషన్స్, ఎన్టీఆర్ ఆర్ట్స్ సోషల్ మీడియా వేదికగా వెల్లడించాయి.
"మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్ ఫైర్‌తో ఒక భారీ సాయంత్రం సెలబ్రేట్ చేసుకుందాం. ఏప్రిల్ 12న 'అర్జున్ S/O వైజయంతి' ప్రీ రిలీజ్ ఈవెంట్లో కలుద్దాం" అంటూ ఓ పోస్టర్‌ను విడుదల చేశారు. కాగా, రేపు రాత్రి 7.59 గంటలకు ఈ మూవీ ట్రైలర్‌ను విడుదల చేస్తున్నట్టు ఇప్పటికే మేకర్స్ ప్రకటించిన విషయం తెలిసిందే.
ఇక ఈ మాస్ యాక్షన్ డ్రామాలో కల్యాణ్ రామ్ సరసన కథానాయికగా సయీ మంజ్రేకర్ నటించగా... లేడీ సూపర్ స్టార్ విజయశాంతి పవర్ఫుల్ పోలీస్ అధికారి పాత్రలో కనిపించనున్నారు. ఇప్పటికే రిలీజైన ప్రచార చిత్రాలు, టైటిల్ పోస్టర్, ఇటీవలే వదిలిన టీజర్ సినీ అభిమానులను విశేషంగా ఆకట్టుకున్నాయి. దీంతో మూవీపై మంచి అంచనాలు నెలకొన్నాయి.