Pawan Kalyan: ప‌వ‌న్ త‌న‌యుడిని కాపాడిన వారికి సింగ‌పూర్ స‌ర్కార్ స‌త్కారం

Singapore Govt Honors Rescuers of Pawan Kalyans Son
  • ఈ నెల 8న సింగ‌పూర్‌లోని స్కూల్‌లో అగ్నిప్ర‌మాదం
  • ప్ర‌మాదంలో చిక్కుకున్న 16 మంది చిన్నారుల‌ను కాపాడిన‌ అక్క‌డి భార‌తీయ ప్ర‌వాసులు
  • తాజాగా వారిని స‌త్క‌రించిన సింగ‌పూర్ ప్ర‌భుత్వం
  • ఈ ప్ర‌మాదంలో గాయ‌ప‌డిన ప‌వ‌న్ త‌న‌యుడు మార్క్ శంక‌ర్‌
  • ప్ర‌స్తుతం ఇంటి వ‌ద్ద‌ కోలుకుంటున్న బాలుడు
ఏపీ డిప్యూటీ సీఎం ప‌వ‌న్ క‌ల్యాణ్ చిన్న కుమారుడు మార్క్ శంక‌ర్ ప‌వ‌నోవిచ్ ఇటీవ‌ల సింగ‌పూర్ పాఠ‌శాల‌లో జ‌రిగిన అగ్నిప్ర‌మాదంలో గాయ‌ప‌డిన విష‌యం తెలిసిందే. ప్ర‌స్తుతం కోలుకుంటున్నాడు. ఈ క్ర‌మంలో సింగ‌పూర్ స‌ర్కార్ కీల‌క‌ నిర్ణ‌యం తీసుకుంది. తాజాగా మార్క్ శంక‌ర్‌ను కాపాడిన వారిని స‌త్క‌రించింది. 

కాగా, ఈ ప్ర‌మాదంలో చిక్కుకున్న 16 మంది చిన్నారుల‌ను, ఆరుగురు పెద్ద‌వారిని అక్క‌డి భార‌తీయ ప్ర‌వాసులు కాపాడారు. వారంద‌రినీ తాజాగా సింగ‌పూర్ ప్ర‌భుత్వం స‌త్క‌రించింది. ఈ నెల 8న ప్ర‌మాదం జ‌రిగిన స‌మ‌యంలో భవ‌నంలోని మూడో అంత‌స్తు నుంచి పొగ‌లు రావ‌డం, చిన్నారుల అరుపులు విన్న న‌లుగురు భార‌తీయ కార్మికులు ఏమాత్రం ఆల‌స్యం చేయ‌కుండా వారిని ర‌క్షించార‌ని ప్ర‌భుత్వం తెలిపింది. 

వారి ప్రాణాల‌ను లెక్క‌చేయ‌కుండా చిన్నారుల‌ను కాపాడినందుకు స‌త్క‌రించిన‌ట్లు పేర్కొంది. ఇక ఈ ప్ర‌మాదంలో గాయ‌ప‌డిన మార్క్ శంక‌ర్ ఇంటికి చేరుకుని, కోలుకుంటున్న విష‌యం తెలిసిందే. త‌మ త‌న‌యుడు కోలుకోవాల‌ని ప్రార్థించిన వారంద‌రికీ బాలుడి పెద్ద‌నాన్న‌ చిరంజీవి సోష‌ల్ మీడియా వేదిక‌గా ప్ర‌త్యేకంగా ధ‌న్య‌వాదాలు తెలిపారు. అటు అభిమానులు కూడా ప‌వ‌న్ త‌న‌యుడు క్షేమంగా తిరిగి రావ‌డంతో హ‌ర్షం వ్య‌క్తం చేశారు.  
Pawan Kalyan
Mark Shankar Pawanovich
Singapore fire accident
Indian expats
Singapore government
Chiranjeevi
School fire
rescue
heroes
AP Deputy CM

More Telugu News