South Central Railway: విశాఖ నుంచి సమ్మర్ స్పెషల్ రైళ్లు ప్రకటించిన దక్షిణ మధ్య రైల్వే... డీటెయిల్స్ ఇవిగో!

South Central Railways Summer Special Train Schedule from Visakhapatnam
  • వేసవిలో పెరిగే రద్దీకి అనుగుణంగా ప్రత్యేక రైళ్లు
  • తిరుపతి, బెంగళూరు, కర్నూలుకు ప్రత్యేక రైళ్లు
  • ఏప్రిల్ 13 నుంచి మే నెలాఖరు వరకు అందుబాటులో ఉంటాయన్న రైల్వే శాఖ 
వేసవి సెలవుల రద్దీని దృష్టిలో ఉంచుకుని దక్షిణ మధ్య రైల్వే విశాఖపట్నం నుంచి బెంగళూరు, తిరుపతి, కర్నూలు సిటీలకు ప్రత్యేక రైళ్లను నడపనుంది. ఈ ప్రత్యేక రైళ్లు ఏప్రిల్ 13 నుంచి మే నెలాఖరు వరకు అందుబాటులో ఉంటాయి. ప్రయాణికుల సౌకర్యార్థం మొత్తం ప్రత్యేక వీక్లీ రైళ్లను నడపనున్నట్లు రైల్వే శాఖ ప్రకటించింది.

విశాఖపట్నం-బెంగళూరు ప్రత్యేక రైళ్లు (14 ట్రిప్పులు)

* రైలు నెంబర్ 08581 విశాఖపట్నం నుంచి ప్రతి ఆదివారం బయలుదేరుతుంది.
* తిరుగు ప్రయాణంలో రైలు నెంబర్ 08582 బెంగళూరు నుంచి ప్రతి సోమవారం బయలుదేరుతుంది.
* ఈ రైలు దువ్వాడ, అనకాపల్లి, యలమంచిలి, సామర్లకోట, రాజమండ్రి, ఏలూరు, విజయవాడ, ఒంగోలు, నెల్లూరు, గూడూరు, రేణిగుంట, జోలార్‌పేట, కుప్పం, బంగారుపేట, కృష్ణరాజపురం స్టేషన్లలో ఆగుతుంది.
* 2ఏసీ, 3ఏసీ, స్లీపర్, జనరల్ కోచ్‌లు అందుబాటులో ఉంటాయి.

విశాఖపట్నం-తిరుపతి ప్రత్యేక రైళ్లు (14 ట్రిప్పులు)

* రైలు నెంబర్ 08547 విశాఖపట్నం నుంచి ప్రతి బుధవారం బయలుదేరుతుంది.
* తిరుగు ప్రయాణంలో రైలు నెంబర్ 08548 తిరుపతి నుంచి ప్రతి గురువారం బయలుదేరుతుంది.
* ఈ రైలు దువ్వాడ, అనకాపల్లి, యలమంచిలి, అన్నవరం, సామర్లకోట, రాజమండ్రి, నిడదవోలు, తణుకు, భీమవరం టౌన్, కైకలూరు, గుడివాడ, విజయవాడ, తెనాలి, చీరాల, ఒంగోలు, నెల్లూరు, గూడూరు, శ్రీకాళహస్తి, రేణిగుంట స్టేషన్లలో ఆగుతుంది.
* 2ఏసీ, 3ఏసీ, జనరల్ కోచ్‌లు ఉంటాయి.

విశాఖపట్నం-కర్నూలు సిటీ ప్రత్యేక రైళ్లు (14 ట్రిప్పులు)

* రైలు నెంబర్ 08545 ప్రతి మంగళవారం విశాఖపట్నం నుంచి కర్నూలు సిటీకి బయలుదేరుతుంది.
* తిరుగు ప్రయాణంలో రైలు నెంబర్ 08546 బుధవారం నాడు కర్నూలు సిటీ నుంచి బయలుదేరుతుంది.
* ఈ రైలు దువ్వాడ, అనకాపల్లి, తుని, అన్నవరం, సామర్లకోట, రాజమండ్రి, ఏలూరు, విజయవాడ, గుంటూరు, నరసరావుపేట, వినుకొండ, మార్కాపురం, కంభం, గిద్దలూరు, దిగువమెట్ట, నంద్యాల, డోన్ స్టేషన్లలో ఆగుతుంది.
* 2ఏసీ, 3ఏసీ, జనరల్ కోచ్‌లు ఉంటాయి.

ఈ ప్రత్యేక రైళ్ల రాకపోకల సమయాలను రైల్వే శాఖ త్వరలో వెల్లడించనుంది. ప్రయాణికులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని రైల్వే అధికారులు కోరారు.

South Central Railway
Visakhapatnam Summer Special Trains
Visakhapatnam to Bangalore Train
Visakhapatnam to Tirupati Train
Visakhapatnam to Kurnool Train
Summer Vacation Special Trains
Weekly Special Trains
Train Timings
AC Coach
Sleeper Coach

More Telugu News