Vijay: అసెంబ్లీ ఎన్నికల్లో అసలు పోరాటం డీఎంకే, టీవీకే మధ్యే ఉంటుంది: హీరో విజయ్

Vijay Predicts DMK and TVK Face off in TN Assembly Elections
  • తమిళనాడులో మారుతున్న రాజకీయ సమీకరణాలు
  • మళ్లీ చేతులు కలిపిన పాత మిత్రులు అన్నాడీఎంకే, బీజేపీ
  • ఈ పొత్తులో ఆశ్చర్యమేమీ లేదన్న విజయ్
  • వారికి ప్రజలే తగిన గుణపాఠం చెబుతారని వ్యాఖ్యలు 
తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల్లో కలిసి పోటీ చేయాలని అన్నాడీఎంకే, బీజేపీ నిర్ణయించుకోవడంపై టీవీకే పార్టీ అధినేత, హీరో విజయ్ స్పందించారు. అన్నాడీఎంకే-బీజేపీ పొత్తు ఆశ్చర్యం కలిగించలేదని, వాళ్లు పాత భాగస్వాములేనని, కాకపోతే మళ్లీ కలిశారని వ్యాఖ్యానించారు. వేరే మార్గం లేక, విధిలేని పరిస్థితుల్లో పొత్తు కుదుర్చుకున్నారని పేర్కొన్నారు. వారికి ప్రజలే తగిన గుణపాఠం చెబుతారని విజయ్ తెలిపారు. 

ఈసారి అసెంబ్లీ ఎన్నికల్లో అన్నాడీఎంకే-బీజేపీ పొత్తు ప్రభావం పెద్దగా ఉండకపోవచ్చని... అసలైన పోరు డీఎంకే, టీవీకే మధ్యనే ఉంటుందని ధీమా వ్యక్తం చేశారు. 

ఇక, డీఎంకే, బీజేపీ వేర్వేరు కాదని, ఆ రెండు పార్టీలు ఒక్కటేనని, కానీ ప్రజల కంటితుడుపు కోసం శత్రువులుగా నటిస్తుంటాయని విజయ్ విమర్శించారు. అవినీతిపై పోరాడుతున్నామని చెప్పే కేంద్ర ప్రభుత్వం ఎందుకు తమిళనాడు సర్కారుపై చర్యలు తీసుకోవడంలేదని సూటిగా ప్రశ్నించారు.
Vijay
Tamil Nadu Assembly Elections
DMK
ADMK
BJP
TVK
Tamil Nadu Politics
Indian Politics
Kollywood
Election Alliance

More Telugu News