Anna Konidela: తిరుమల చేరుకుని డిక్లరేషన్ పై సంతకం చేసిన అనా కొణిదెల... స్వామివారికి తలనీలాల సమర్పణ

- సింగపూర్ అగ్నిప్రమాదం నుంచి క్షేమంగా బయటపడిన మార్క్ శంకర్
- మొక్కు తీర్చుకునేందుకు తిరుమల వచ్చిన అనా కొణిదెల
- స్వాగతం పలికిన పార్టీ వర్గాలు, టీటీడీ అధికారులు
ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ అర్ధాంగి అనా కొణిదెల తిరుమల చేరుకున్నారు. ఇక్కడి గాయత్రి సదనంలో టీటీడీ అధికారుల సమక్షంలో డిక్లరేషన్ పత్రాలపై సంతకం చేశారు. తిరుమల విచ్చేసిన అనా కొణిదెలకు జనసేన నేతలు, టీటీడీ అధికారులు స్వాగతం పలికారు. ఆమె ఈ రాత్రికి తిరుమలలో బస చేయనున్నారు. రేపు ఉదయం సుప్రభాత సేవలో వెంకటేశ్వరస్వామిని దర్శించుకోనున్నారు.
తనయుడు మార్క్ శంకర్ సింగపూర్ అగ్నిప్రమాదం నుంచి స్వల్ప గాయాలతో క్షేమంగా బయటపడిన నేపథ్యంలో ఆమె మొక్కులు తీర్చుకునేందుకు తిరుమల వచ్చారు.
తనయుడు మార్క్ శంకర్ సింగపూర్ అగ్నిప్రమాదం నుంచి స్వల్ప గాయాలతో క్షేమంగా బయటపడిన నేపథ్యంలో ఆమె మొక్కులు తీర్చుకునేందుకు తిరుమల వచ్చారు.