DRDO: ఓర్వకల్లు డీఆర్డీవో కేంద్రంలో అత్యాధునిక లేజర్ ఆయుధ పరీక్ష... అగ్రరాజ్యాల సరసన భారత్

Indias Advanced Laser Weapon Successfully Tested at DRDO Orvakal
 
ఏపీలోని కర్నూలు జిల్లా ఓర్వకల్లులో భారత రక్షణ రంగ పాటవాన్ని ఇనుమడింపజేసే అత్యాధునిక లేజర్ ఆయుధ పరీక్ష జరిగింది. ఇక్కడి డీఆర్డీవో కేంద్రంలో నేడు కీలక ఆయుధ పరీక్షలు చేపట్టారు. 30 కిలోవాట్ల లేజర్ ఆధారిత ఆయుధ వ్యవస్థను ఉపయోగించి డ్రోన్ లను కూల్చివేసే పరీక్షలు నిర్వహించారు. 

ఫిక్స్ డ్ వింగ్ ఎయిర్ క్రాఫ్ట్ లు, మిస్సైళ్లు, డ్రోన్లను ఈ లేజర్ ఆయుధంతో కూల్చివేయడం ఈ పరీక్ష ముఖ్య ఉద్దేశం. లేజర్ కిరణం తాకగానే, లక్ష్యంగా ఉన్న వస్తువు కాలి బూడిదైంది. ఈ పరీక్ష సక్సెస్ కావడంతో భారత్... అమెరికా, చైనా, రష్యా దేశాల సరసన చేరింది. 

ఈ పరీక్ష విజయవంతం కావడంతో భారత రక్షణ వర్గాల్లో హర్షం వ్యక్తమైంది. ఈ పరీక్ష తాలూకు వీడియోను డీఆర్డీవో తన సోషల్ మీడియా ఖాతాలో పంచుకుంది.
DRDO
Laser Weapon
Orvakal
Kurnool
India
Defense Technology
Military Technology
Drone Defense
High-powered Laser
30-kilowatt Laser

More Telugu News