Vashishth Dhruv: మద్యం మత్తులో కారు నడిపి ఆటోను ఢీకొట్టిన కేకే మనవడు

K Keshav Raos Grandson Involved in Drunk Driving Accident
         
తెలంగాణ ప్రభుత్వ సలహాదారు కె. కేశవరావు మనవడు వశిష్ట్ ధ్రువ్ (21) తాగిన మత్తులో కారు నడుపుతూ ఆటోను ఢీకొట్టాడు. నిన్న తన స్నేహితుడితో కలిసి కారులో కేబీఆర్ పార్క్ మీదుగా జూబ్లీహిల్స్ చెక్‌పోస్టు వైపు బయలుదేరాడు. జూబ్లీహిల్స్ చెక్‌పోస్టు వద్ద సిగ్నల్ పడటంతో ముందు వెళ్తున్న ట్రాలీ ఆటో ఆగింది. దీంతోవెనక వస్తున్న ధ్రువ్ ఒక్కసారిగా ట్రాలీని ఢీకొట్టాడు. ఈ ఘటనలో కారు ముందు భాగం, ఆటో వెనుక భాగం ధ్వంసమయ్యాయి. పోలీసులు ధ్రువ్‌కు బ్రీత్ అనలైజర్ టెస్ట్ నిర్వహించగా 150 బీఏసీ పాయింట్లు వచ్చాయి. దీంతో ఆయన కారును పోలీసులు సీజ్ చేశారు. కారు నడుపుతున్న వశిష్ట్ ధ్రువ్‌పై సుమోటో కింద కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. 

బంజారాహిల్స్‌లో నివసిస్తున్న కేకే కుమారుడు విప్లవ్ కుమార్ కుమారుడే వశిష్ట్ ధ్రువ్. బీఆర్ఎస్ హయాంలో తెలంగాణ పట్టణ మౌలిక సదుపాయాల ఆర్థిక సంస్థ కార్పొరేషన్ చైర్మన్‌గా విప్లవ్ కుమార్ పనిచేశారు. 
Vashishth Dhruv
K. Keshav Rao
Drunk Driving
Car Accident
Jubilee Hills
Hyderabad
Breath Analyzer Test
Telangana
Road Accident
Traffic Violation

More Telugu News