Revanth Reddy: భూభారతి పోర్టల్‌ను ప్రారంభించిన తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి

- ప్రయోగాత్మకంగా మూడు మండలాల్లో అమలు చేయనున్న ప్రభుత్వం
- జూన్ 2 నాటికి తెలంగాణ వ్యాప్తంగా పూర్తి స్థాయిలో అమలు
- ధరణిని పక్కన పడేశామన్న మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి
తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి 'భూభారతి' పోర్టల్‌ను ప్రారంభించారు. హైదరాబాద్‌లోని శిల్పకళా వేదికలో జరిగిన ఈ కార్యక్రమంలో ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క, పలువురు మంత్రులు పాల్గొన్నారు. 'భూభారతి' పోర్టల్‌ను ప్రయోగాత్మకంగా మూడు మండలాల్లో అమలు చేయనున్నారు.
జూన్ 2వ తేదీ నాటికి తెలంగాణ వ్యాప్తంగా పూర్తిస్థాయిలో అమలు చేయాలని రాష్ట్ర ప్రభుత్వం భావిస్తోంది. మూడు మండలాల్లో ప్రయోగాత్మకంగా చేపట్టి ప్రజల నుంచి సలహాలు, సూచనలు స్వీకరించి, అవసరమైతే తగిన మార్పులు చేయనుంది. ప్రజల నుంచి వచ్చే స్పందనను బట్టి పోర్టల్‌ను ఎప్పటికప్పుడు అప్డేట్ చేస్తారు.
పోర్టల్ ప్రారంభోత్సవం అనంతరం మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి మాట్లాడుతూ, గత బీఆర్ఎస్ ప్రభుత్వం తీసుకువచ్చిన ధరణి పోర్టల్ రైతులకు ప్రయోజనకరంగా లేదని అన్నారు. అందుకే దానిని పక్కన పెట్టేశామని అన్నారు. ధరణి పోర్టల్‌ను దొరలకు, భూస్వాములకు అనుకూలంగా రూపొందించారని అన్నారు.
ధరణి అరాచకాల ఫలితం గత అసెంబ్లీ ఎన్నికల ఫలితాల్లో కనిపించిందని మంత్రి అన్నారు. తాము ఇచ్చిన వాగ్దానం మేరకు ప్రజలకు ఉపయోగపడేలా భూభారతిని తీసుకువచ్చామని వెల్లడించారు. కలెక్టర్ వద్ద ఉన్న అధికారాలను వికేంద్రీకరణ చేశామని అన్నారు. వివిధ రాష్ట్రాల్లోని భూ చట్టాలను అధ్యయనం చేసి ఉత్తమ చట్టం రూపొందించినట్లు మంత్రి తెలిపారు.