Team India: బంగ్లాదేశ్ లో టీమిండియా వైట్ బాల్ టూర్... షెడ్యూల్ ప్రకటించిన బీసీసీఐ

Team Indias Bangladesh Tour Schedule Released by BCCI
  • బంగ్లాదేశ్ లో 3 వన్డేలు, 3 టీ20లు ఆడనున్న టీమిండియా
  • ఆగస్టు 17 నుంచి పర్యటన ప్రారంభం
  • ఇంగ్లండ్ తో టెస్టు సిరీస్ అనంతరం బంగ్లాదేశ్ పర్యటన
ఈ ఏడాది టీమిండియా పురుషుల జట్టు బంగ్లాదేశ్ లో పర్యటించనుంది. ఈ పర్యటనలో టీమిండియా మూడు వన్డేలు, మూడు టీ20 మ్యాచ్ లు ఆడనుంది. ఈ పర్యటన షెడ్యూల్ ను భారత క్రికెట్ కంట్రోల్ బోర్డు (బీసీసీఐ) నేడు విడుదల చేసింది. కాగా బంగ్లాదేశ్ పర్యటనకు ముందు టీమిండియా... ఇంగ్లండ్ లో ఐదు టెస్టుల సిరీస్ ఆడనుంది. జూన్ 20న ప్రారంభమయ్యే ఈ సిరీస్ జులై 4న ముగియనుంది. ఈ సిరీస్ తర్వాత టీమిండియా బంగ్లాదేశ్ లో పర్యటిస్తుంది. 

టీమిండియా-బంగ్లాదేశ్ తో వన్డే సిరీస్
తొలి వన్డే- ఆగస్టు 17 (మిర్పూర్)
రెండో వన్డే- ఆగస్టు 20 (మిర్పూర్)
మూడో వన్డే- ఆగస్టు 23 (చట్టోగ్రామ్)

టీమిండియా-బంగ్లాదేశ్ టీ20 సిరీస్
తొలి టీ20- ఆగస్టు 26 (చట్టోగ్రామ్)
రెండో టీ20- ఆగస్టు 29 (మిర్పూర్)
మూడో టీ20- ఆగస్టు 31 (మిర్పూర్)



Team India
Bangladesh tour
BCCI
Cricket Schedule
India vs Bangladesh
ODI Series
T20 Series
Mirpur
Chattogram
Cricket

More Telugu News