San Diego Zoo: కాలిఫోర్నియాలో భూకంపం... వింతగా ప్రవర్తించిన ఏనుగులు!

California Earthquake Elephants Strange Behavior Before Tremors
 
అమెరికాలోని దక్షిణ కాలిఫోర్నియాలో ఈ ఉదయం భూకంపం సంభవించింది. రిక్టర్ స్కేలుపై దీని తీవ్రత 5.2గా నమోదైంది. కాగా, ఈ భూకంపం సందర్భంగా శాన్ డియాగో జూలోని ఏనుగులు విచిత్రంగా ప్రవర్తించాయి. భూమి కంపించడానికి కొన్ని సెకన్ల ముందే అవి అప్రమత్తం అయ్యాయి. ప్రకంపనలు వచ్చే సమయంలో అలజడికి గురైనట్టుగా అటూ ఇటూ పరుగులు తీశాయి. తీవ్ర ఆందోళన చెందుతున్నట్టుగా  ఏనుగులన్నీ ఒక చోటికి చేరి వలయాకారంలో నిలుచున్నాయి. 

సాధారణంగా ఏదైనా జంతువుల దాడిని ఎదుర్కోవడానికి గజరాజులు ఇలా సర్కిల్ ఫార్మేషన్ లో నిల్చుంటాయి. తమ గుంపులోని చిన్న లేదా బలహీనమైన ఏనుగును రక్షించుకోవడానికి ఇలా చేస్తుంటాయి. ఇప్పుడు భూకంపం సమయంలోనూ ఏనుగులు వలయాకారంలో నిల్చుని ప్రమాదాన్ని ఎదుర్కోవడానికి సిద్ధమయ్యాయి. దీనికి సంబంధించిన వీడియోను శాన్ డియాగో జూ విడుదల చేసింది.
San Diego Zoo
California Earthquake
Elephant Behavior
Earthquake Prediction
Animal Instincts
Seismic Activity
Southern California Earthquake
5.2 Magnitude Earthquake

More Telugu News