MS Dhoni: బాలీవుడ్‌లోకి ధోనీ ఎంట్రీ... క‌ర‌ణ్ జోహార్ పోస్ట్ వైర‌ల్‌!

MS Dhonis Bollywood Entry Karan Johars Viral Post Sparks Speculation
    
బాలీవుడ్ ప్ర‌ముఖ ద‌ర్శ‌క‌నిర్మాత క‌ర‌ణ్ జోహార్ చేసిన ఓ ఇన్‌స్టా పోస్ట్ ప్ర‌స్తుతం సామాజిక మాధ్య‌మాల్లో వైర‌ల్ అవుతోంది. త్వ‌ర‌లోనే టీమిండియా మాజీ కెప్టెన్ మ‌హేంద్ర సింగ్ ధోనీ ఓ రొమాంటిక్ రోల్‌లో క‌నిపించ‌బోతున్నాడు అంటూ త‌న ఇన్‌స్టా స్టోరీలో క‌ర‌ణ్ జోహార్ రాసుకొచ్చారు. 

ఇక ఈ పోస్టుకు క‌ర‌ణ్ ఓ వీడియోను కూడా జోడించారు. అందులో ఎంఎస్‌డీ ల‌వ్ సింబ‌ల్ బెలూన్ ప‌ట్టుకొని క‌నిపించారు. దీంతో ఈ స్టార్ క్రికెట‌ర్‌ను క‌ర‌ణ్ బాలీవుడ్‌లో లాంచ్ చేస్తార‌నే ప్ర‌చారం జ‌రుగుతోంది. ఈ నేప‌థ్యంలోనే బాలీవుడ్‌లోకి త‌లా ఎంట్రీ ఇస్తున్నార‌నే వార్త‌లు చ‌క్క‌ర్లు కొడుతున్నాయి. అయితే, ఇది ఓ యాడ్ షూటింగ్ కావొచ్చ‌ని కొంద‌రు అభిప్రాయపడుతున్నారు.  


MS Dhoni
Bollywood
Karan Johar
Viral Post
Dhoni Bollywood Debut
Romantic Role
Indian Cricket
Bollywood Entry
Ad Shoot

More Telugu News