WhatsApp Governance: వాట్సాప్ గవర్నెన్స్‌కు ఆర్థిక సంఘం ప్రశంస

WhatsApp Governance Wins Praise from Finance Commission
  • ప్రధానికి వివరించారా అని ఆరా తీసిన అరవింద్ పనగారియా 
  • రానున్న రోజుల్లో వాట్సాప్ ద్వారానే 1000 సేవలు అందిస్తామన్న‌ సీఎం
  • వాట్సప్ గవర్నెన్స్‌కు హ్యాట్సాఫ్ చెప్పిన ఛైర్మన్, కమిషన్ సభ్యులు 
సీఎం చంద్ర‌బాబు 16వ ఆర్థిక సంఘానికి ప్ర‌భుత్వం తీసుకొచ్చిన‌ వివిధ అంశాల‌పై వివ‌ర‌ణ ఇచ్చారు. అనంతరం ఆయా అంశాలపై ఆర్థిక సంఘం తమ అభిప్రాయాలు చెప్పింది. ఇందులో భాగంగా రాష్ట్ర ప్రభుత్వం తీసుకువచ్చిన వాట్సాప్ గవర్నెన్స్ పై ఛైర్మన్ తో పాటు కమిషన్ సభ్యులు ప్రశంసలు కురిపించారు. వాట్సాప్ గవర్నెన్స్ విధానాన్ని ప్రధాని నరేంద్ర మోదీ దృష్టికి తీసుకువెళ్లారా అని సీఎంను పనగారియా అడిగారు. ఇంకా లేదని, వచ్చే నెలలో ప్రధానితో భేటీ సందర్భంగా ఆయనకు ఈ ప్రాజెక్ట్‌పై వివరిస్తామని సీఎం తెలిపారు. 

ప్రభుత్వ సేవలకు కార్యాలయాలకు వెళ్లే అవసరం లేకుండా ప్రతి ఒక్కరూ వాట్సాప్ ద్వారా సేవలు పొందే పరిస్థితి తీసుకువస్తున్నామని, రానున్న రోజుల్లో 1000 సేవలు అందిస్తామని సీఎం ఈ సందర్భంగా చెప్పారు. ఒక ముఖ్యమంత్రి స్వయంగా ఆర్ధిక అంశాలపై ప్రజెంటేషన్ ఇవ్వడం తమను ఎంతో ఆశ్చర్య పరిచిందని, వృద్ధి గణాంకాలపై ఇంత లోతుగా విశ్లేషించడం, కేంద్ర సాయం పొందేందుకు చేస్తున్న ప్రయత్నాలను పనగారియా ప్రశంసించారు. 

మరోవైపు 30 ఏళ్ల క్రితం తాను హైదరాబాద్ వెళ్లిన నాటికి... నేటికీ ఎంతో అభివృద్ధి చెందిందని.. ఇదంతా ముఖ్యమంత్రి చంద్రబాబు విజన్ వల్లే సాధ్యమైందని ఆర్ధిక సంఘం సభ్యురాలు అన్నెజార్జ్ మాథ్యూ అన్నారు. అమరావతి కూడా అదే స్థాయిలో చంద్రబాబు అభివృద్ధి చేస్తారనే నమ్మకం ఉందన్నారు.
WhatsApp Governance
Chandrababu Naidu
15th Finance Commission
Narendra Modi
Andhra Pradesh
Government Services
Digital Governance
Amravati Development
Economic Growth
India

More Telugu News