Luis: యువతులను ట్రాప్ చేసి నగ్న వీడియోలు.. డబ్బులిస్తే ప్రత్యక్ష ప్రసారం

Shocking Cybercrime AP Police Arrest Gangs for Extorting Women with Nude Videos
  • గుంతకల్లు, బెంగళూరులో రెండు ముఠాలను అరెస్ట్ చేసిన సీఐడీ క్రైం విభాగం పోలీసులు
  • ఉద్యోగం పేరుతో మహిళలకు ప్రలోభం
  • ఈజీగా డబ్బులు సంపాదించవచ్చంటూ మాయమాటలు
  • ఆపై నగ్న వీడియోల చిత్రీకరణ
  • నిషేధిత వెబ్‌సైట్ల ద్వారా ప్రత్యక్ష ప్రసారం
  • క్రిప్టో కరెన్సీ రూపంలో లక్షల్లో సంపాదన
యువతులను ట్రాప్ చేసి, వారితో నగ్న వీడియోలు చిత్రీకరించడంతోపాటు డబ్బులిస్తే శృంగార దృశ్యాలను ప్రత్యక్ష ప్రసారం చేస్తున్న రెండు ముఠాలను ఏపీ సీఐడీ క్రైం విభాగం పోలీసులు పట్టుకున్నారు. పోలీసుల కథనం ప్రకారం.. గుంతకల్లుకు చెందిన లూయిస్ స్థానికంగా ఓ కాల్ సెంటర్ ఏర్పాటు చేశాడు. ఉద్యోగం పేరుతో యువతులు, మహిళలను ట్రాప్ చేసేవాడు. తాను చెప్పినట్టు చేస్తే పెద్ద మొత్తంలో డబ్బులు సంపాదించవచ్చని నమ్మించి నగ్న వీడియోల చిత్రీకరణకు ఒప్పించేవాడు.

మరోవైపు, శ్రీకాకుళానికి చెందిన గణేశ్, జ్యోత్స్న బంధువులమని చెప్పుకుని బెంగళూరులో ఉంటూ అక్కడ ఉద్యోగ ప్రయత్నాలు చేస్తున్న యువతులను, ఆర్థికంగా ఇబ్బందుల్లో ఉన్న వారిని గుర్తించి పరిచయం పెంచుకునేవారు. విలాసంగా జీవించాలంటే తాము చెప్పినట్టు చేయాలని ఉచ్చులోకి దింపేవారు. మాట వినకుంటే ఫోటోలు మార్ఫింగ్ చేసి బంధువులు, కుటుంబ సభ్యులకు పంపిస్తామని బెదిరించేవారు.

ఇలా గుంతకల్లులో లూయిస్, బెంగళూరులో గణేశ్, జ్యోత్స్న అద్దె భవనాల్లో నగ్న వీడియోలు చిత్రీకరించేవారు. ఆన్‌లైన్ ద్వారా నగదు చెల్లించే వారికి నిషేధిత వెబ్‌సైట్ల ద్వారా శృంగార దృశ్యాలను ప్రత్యక్ష ప్రసారం చేసేవారు. పోర్న్ వీడియోలను వెబ్‌సైట్లలో పెట్టడం ద్వారా క్రిప్టో కరెన్సీ రూపంలో లక్షల రూపాయలు సంపాదిస్తున్నారు. లూయిస్, గణేశ్, జ్యోత్స్నలను పోలీసులు అరెస్ట్ చేశారు. ఈ ముఠా బారినపడిన వారు ఎవరైనా ఉంటే సీఐడీ కార్యాలయంలో కానీ, 1930కి ఫోన్ చేసి కానీ ఫిర్యాదు చేయాలని పోలీసులు తెలిపారు. 
Luis
Ganesh
Jyothsna
AP CID Crime
Cybercrime
Sex Trafficking
Online Pornography
Live Streaming
Nude Videos
Extortion

More Telugu News