Revanth Reddy: రేవంత్ కు ప్రైవేట్ సైన్యంలా పని చేస్తున్న పోలీసులు ఊచలు లెక్కించాల్సి వస్తుంది: కేటీఆర్

KTR Accuses Revanth Reddy of Using Police as Private Army
  • రేవంత్ కారణంగా సీఎస్, ఇతర అధికారులు బలవుతున్నారన్న కేటీఆర్
  • ఇతర అధికారులు జాగ్రత్తగా ఉండాలని సూచన
  • కొందరు పోలీసు అధికారులు ఇష్టానుసారం కేసులు పెడుతున్నారని మండిపాటు
సీఎం రేవంత్ రెడ్డిపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ మరోసారి విమర్శలు గుప్పించారు. ముఖ్యమంత్రి కారణంగా చీఫ్ సెక్రటరీ, ఇతర అధికారులు బలవుతున్నారని అన్నారు. ఇప్పటి వరకు ఐఏఎస్, అటవీశాఖ అధికారుల వంతు అయిపోయిందని... ఇతర అధికారులు కూడా జాగ్రత్తగా ఉండాలని చెప్పారు. హైదరాబాద్ లో మీడియాతో మాట్లాడుతూ ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. 

కొందరు పోలీసులు రేవంత్ రెడ్డికి సైన్యంలా వ్యవహరిస్తున్నారని కేటీఆర్ విమర్శించారు. ఇష్టానుసారం కేసులు పెడుతున్నారని... అలాంటి అధికారులపై సుప్రీంకోర్టును ఆశ్రయిస్తామని చెప్పారు. రేవంత్ రెడ్డికి ప్రైవేటు సైన్యంలా పని చేస్తున్న పోలీసులు ఊచలు లెక్కించాల్సి వస్తుందని హెచ్చరించారు. కంచ గచ్చిబౌలి భూముల వ్యవహారంలో కాంగ్రెస్ ప్రభుత్వ తీరును సుప్రీంకోర్టు ఎండగట్టిందని తెలిపారు.
Revanth Reddy
KTR
Telangana Politics
Police Controversy
BRS
Congress
Supreme Court
Hyderabad
Political Criticism
Government Officials

More Telugu News