Nadeendla Manohar: మా కూటమి ప్రభుత్వానికి సహకరించండి: బ్యాంకర్స్ కు మంత్రి నాదెండ్ల మనోహర్ పిలుపు

Andhra Minister Nadeendla Manohar Urges Bankers Cooperation
  • మంత్రి నాదెండ్ల అధ్యక్షత బ్యాంకర్స్ తో సమావేశం
  • రేషన్ కోసం ప్రజలు ప్రతి నెలా ఎదురుచూస్తున్నారని వెల్లడి
  • రేషన్ అవసరమైన ప్రజలకు, రైతులకు బ్యాంకర్లు అండగా ఉండాలని విజ్ఞప్తి
ప్రభుత్వం అందించే రేషన్ కోసం చాలామంది ప్రజలు ప్రతినెలా ఎదురుచూస్తున్నారని, రేషన్ అందించేందుకు, రైతుకు అండగా నిలబడేందుకు బ్యాంకర్స్ సహకరించాలని మంత్రి నాదెండ్ల మనోహర్ పేర్కొన్నారు. విజయవాడ కానూరులో సివిల్ సప్లైస్ భవన్ లో ఈరోజు మంత్రి నాదెండ్ల మనోహర్ అధ్యక్షతన బ్యాంకర్స్ తో సమావేశం జరిగింది.

గత ప్రభుత్వం రైతులకు చెల్లించవలసిన బకాయిలు చెల్లించకుండా... 1,674 కోట్ల రూపాయల బకాయిలను వదిలి వెళ్ళిందని అన్నారు. కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత రైతులు చెల్లించవలసిన బకాయిలను చెల్లించడం జరిగిందని వివరించారు. కూటమి ప్రభుత్వం వచ్చిన 9 నెలల కాలంలో దాదాపు 24 వేల కోట్ల రూపాయలను చెల్లించిందని చెప్పారు. సంస్కరణల్లో భాగంగా నూతన సాంకేతిక విధానం అవలంబించి ధాన్యం కొనుగోలుకు వాట్సాప్ విధానం ప్రవేశపెట్టిందన్నారు. వాట్సాప్ విధానంలో 17 వేల మంది రైతులు ధాన్యం అమ్మకం జరిపారన్నారు..

ఖరీఫ్ మాసంలో ఆరు లక్షల మంది రైతుల నుంచి 38 లక్షల మెట్రిక్ టన్నులు ధాన్యం కొనుగోలు చేసినట్టు తెలిపారు. ధాన్యం కొనుగోలు జరిగిన 24 గంటల్లో రైతుల ఖాతాలో నగదు జమ కావడంతో వారు ఆనందంగా ఉన్నారన్నారు. అదేవిధంగా రేషన్ పక్కదారి పట్టకుండా రేషన్ మాఫియాపై  ఉక్కు పాదం మోపడం జరిగిందని నాదెండ్ల మనోహర్ వెల్లడించారు.

నూతన సాంకేతిక విధానంతో కొత్త రేషన్ కార్డులు అందించబోతున్నామని తెలిపారు. ఆర్టిఫిషియల్ ఇంటలిజెన్స్ ఉపయోగించి ప్రతి వేర్ హౌస్ గోడౌన్ వద్ద ఏఐ కెమెరాలను ఏర్పాటు చేయడం జరుగుతుందన్నారు. రాష్ట్రంలో పారదర్శక పాలన అందిస్తున్నామని, కాబట్టి బ్యాంకర్స్ వడ్డీ రేటు తగ్గించుకొని ప్రభుత్వం నిర్వహిస్తున్న అభివృద్ధి కార్యక్రమాలకు సహకరించాలని కోరారు.
Nadeendla Manohar
Andhra Pradesh Government
Bankers Meeting
Agriculture
Farmers
Ration Supply
WhatsApp System
AI Cameras
Transparent Governance
Loan Interest Rates

More Telugu News