Supreme Court: వక్ఫ్ చట్టం-2025ను సవాల్ చేస్తూ 72 పిటిషన్లు... సుప్రీంకోర్టులో విచారణ

Supreme Court Hears Petitions Challenging Waqf Act 2025
  • వక్ఫ్ బిల్లును సవాల్ చేస్తూ సుప్రీంకోర్టులో 72 పిటిషన్లు
  • సమాధానం చెప్పేందుకు వారం రోజుల గడువు కోరిన కేంద్రం
  • తదుపరి విచారణ వరకు వక్ఫ్ ఆస్తులు డీనోటిఫై చేయబోమని తెలిపిన కేంద్రం
వక్ఫ్ సవరణ చట్టం-2025 రాజ్యాంగబద్ధతను సవాల్ చేస్తూ దాఖలైన పిటిషన్లపై సుప్రీంకోర్టులో విచారణ జరిగింది. వక్ఫ్ బిల్లును సవాల్ చేస్తూ సుప్రీంకోర్టులో 72 పిటిషన్లు దాఖలయ్యాయి. వక్ఫ్ బిల్లుపై సమాధానం చెప్పేందుకు కేంద్రం వారం రోజుల గడువు కోరడంతో న్యాయస్థానం అంగీకరించింది.

తదుపరి విచారణ వరకు వక్ఫ్ ఆస్తులను డీనోటిఫై చేయబోమని కేంద్రం సుప్రీంకోర్టుకు తెలిపింది. అప్పటివరకు వక్ఫ్ కౌన్సిల్‌లో ముస్లిమేతరులను సభ్యులుగా నియమించవద్దని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. తదుపరి విచారణను సుప్రీంకోర్టు మే 5వ తేదీకి వాయిదా వేసింది.
Supreme Court
Waqf Act 2025
Waqf Amendment Act
Constitutional Validity
India
Petitions
Central Government
Muslim
Waqf Properties
De-notification

More Telugu News