AP Govt: ఏపీలోని మ‌హిళా ఉద్యోగుల‌కు తీపి క‌బురు.. ప్ర‌భుత్వం కీల‌క ఉత్త‌ర్వులు

Good News for Women Government Employees in AP
  
ఏపీలోని కూట‌మి ప్ర‌భుత్వం మహిళా ఉద్యోగుల‌కు తీపి క‌బురు చెప్పింది. కొత్త‌గా నియమితులైన ప్ర‌భుత్వ ఉద్యోగినులు ప్ర‌సూతి సెల‌వులు తీసుకున్నా ప్రొబేష‌న్‌కు ఎలాంటి ఇబ్బంది ఉండ‌దని తెలిపింది. ఈ మేర‌కు ప్రసూతి సెల‌వుల‌ను డ్యూటీగా ప‌రిగ‌ణిస్తూ ప్ర‌భుత్వం గెజిట్ విడుద‌ల చేసింది. ఇదివ‌ర‌కు రెగ్యుల‌ర్ మ‌హిళా ఉద్యోగుల‌కు మాత్ర‌మే మాతృత్వ సెల‌వులు ఉండేవి. తాజాగా స‌ర్కార్ తీసుకున్న‌ ఈ నిర్ణ‌యం ప‌ట్ల ప్ర‌భుత్వ ఉద్యోగినులు హ‌ర్షం వ్య‌క్తం చేస్తున్నారు. 
AP Govt
Andhra Pradesh Government
Women Employees
Maternity Leave
Government Jobs
AP Government Policies
Probation Period
New Rules
Women's Rights
Government Gazette

More Telugu News