Donald Trump: ట్రంప్ వల్ల 40 ఏళ్ల బంధం నాశనమైంది: కెనడా ప్రధాని

Trumps Policies Damage 40 Year Canada US Bond Canada PM
  • కెనడా ఆర్థిక వ్యవస్థకు ట్రంప్ ముప్పుగా మారారన్న కెనడా ప్రధాని
  • కెనడాలో అంతర్గతంగా ఉన్న వాణిజ్య హద్దులను చెరిపేసుకోవాలని సూచన
  • అప్పుడే కెనడా ప్రజలకు ప్రయోజనం కలుగుతుందని వ్యాఖ్య
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ పై కెనడా ప్రధాని మార్క్ కార్నీ విమర్శలు గుప్పించారు. ట్రంప్ విధించిన టారిఫ్ ల వల్ల అమెరికా - కెనడాల మధ్య 40 ఏళ్లుగా ఉన్న బంధం నాశనమయిందని మండిపడ్డారు. కెనడా ఆర్థిక వ్యవస్థకు ట్రంప్ పెను ముప్పుగా మారారని విమర్శించారు. ఈ నెల 28న కెనడాలో ఎన్నికలు జరగనున్నాయి. ఈ నేపథ్యంలో ప్రధాన పార్టీల అభ్యర్థులంతా మాంట్రియల్ లో జరిగిన ఎన్నికల డిబేట్ లో పాల్గొన్నారు. ఈ సందర్భంగా కార్నీ మాట్లాడుతూ ఈ వ్యాఖ్యలు చేశారు. 

ట్రంప్ కారణంగా నెలకొన్న పరిస్థితులను అధిగమించాలంటే కెనడాలో అంతర్గతంగా ఉన్న వాణిజ్య హద్దులను మనం చెరిపేసుకోవాలని కార్నీ సూచించారు. దీనికి ప్రావిన్సులు, టెరిటరీల సహకారం కీలకమని చెప్పారు. అప్పుడే కెనడా ప్రజలకు ఆర్థికంగా ప్రయోజనం కలుగుతుందని అన్నారు. తాను మళ్లీ అధికారంలోకి వస్తే వెంటనే ట్రంప్ తో వాణిజ్య చర్చలు నిర్వహిస్తానని చెప్పారు. 

కెనడాను అమెరికా 51వ రాష్ట్రంగా చేస్తామంటూ ట్రంప్ కొంత కాలంగా బెదిరిస్తున్న సంగతి తెలిసిందే. అది జరిగే పని కాదని కెనడా ప్రతిస్పందించింది. దీంతో, అధ్యక్ష పదవిని చేపట్టిన వెంటనే కెనడాపై ట్రంప్ భారీగా సుంకాలు విధించారు. కెనడా కూడా అమెరికాపై భారీగా టారిఫ్ లు విధించింది. ట్రంప్ తగ్గేంత వరకు తమ ప్రతీకార చర్య కూడా కొనసాగుతుందని ప్రధాని కార్నీ స్పష్టం చేశారు.
Donald Trump
Justin Trudeau
Canada-US relations
Trade War
Tariffs
North American Free Trade Agreement (NAFTA)
USMCA
Canadian Elections
Mark Carney
International Trade

More Telugu News