Subramanya Swamy: తిరుమల గోశాలలో ఆవుల మృతిపై కేసు వేస్తా: సుబ్రహ్మణ్యస్వామి

Subramanian Swamy Enters Tirumala Gosala Cow Death Controversy
  • గోవులు అంటే కేవలం జంతువులు కాదన్న సుబ్రహ్మణ్యస్వామి
  • గోవుల మంచిచెడ్డలు పట్టించుకోకపోవడం వల్లే ఈ దుస్థితి అని విమర్శ
  • టీటీడీ వ్యాపార ధోరణి వల్లే ఇలాంటి ఘటనలు జరుగుతున్నాయని వ్యాఖ్య
తిరుమలలోని గోశాలలో వందకు పైగా గోవులు మృతి చెందాయంటూ వైసీపీ నేత, టీటీడీ మాజీ ఛైర్మన్ భూమన కరుణాకర్ రెడ్డి చేసిన వ్యాఖ్యలు ఏపీలో పొలిటికల్ హీట్ పెంచాయి. ఈ అంశంపై కూటమి, వైసీపీ నేతలు సవాళ్లు, ప్రతిసవాళ్లు విసురుకున్నారు. తాజాగా ఈ ఎపిసోడ్ లోకి బీజేపీ సీనియర్ నేత సుబ్రహ్మణ్యస్వామి ఎంట్రీ ఇచ్చారు. గోశాలలో గోవుల మృతిపై త్వరలోనే తాను కోర్టును ఆశ్రయిస్తానని ఆయన ప్రకటించారు. 

రాజ్యాంగంలో గోవులకు అత్యున్నత స్థానం కల్పించారని సుబ్రహ్మణ్యస్వామి చెప్పారు. గోవు అంటే కేవలం జంతువు మాత్రమే కాదని... కోట్లాది మందికి దైవమని అన్నారు. గోశాలలో గోవుల ఆలనాపాలన పట్టించుకోకపోవడం వల్లే ఈ దుస్థితి తలెత్తిందని చెప్పారు. 

వయసు మళ్లడం వల్లే గోవులు చనిపోతున్నాయని టీటీడీ యాజమాన్యం నిర్లక్ష్యంగా మాట్లాడుతోందని... వయసు మళ్లారని మీ కుటుంబ సభ్యులను కూడా వదిలేస్తారా? అని స్వామి ప్రశ్నించారు. టీటీడీ వ్యాపార ధోరణి వల్లే ఇలాంటి ఘటనలు జరుగుతున్నాయని అన్నారు. ఈ అంశంపై కోర్టులో కేసులు వేస్తానని చెప్పారు.
Subramanya Swamy
Tirumala Gosala
Cow Deaths
Ttd
Andhra Pradesh Politics
Bjp
Ysrcp
Court Case
Animal Welfare
Religious Sentiment

More Telugu News