Secunderabad MMTS Train Rape Case: సికింద్రాబాద్ ఎంఎంటీఎస్ రైల్లో అత్యాచారయత్నం కేసులో కీలక మలుపు

Secunderabad MMTS Rape Case Key Twist in the Investigation
  • ఇన్‌స్టాగ్రాంలో రీల్స్ చేస్తుండగా కిందపడి యువతి
  • అత్యాచారయత్నం జరిగినట్లు నమ్మించిన వైనం
  • 300కు పైగా సీసీ కెమెరాలను పరిశిలించిన పోలీసులు
సికింద్రాబాద్ ఎంఎంటీఎస్ రైల్లో యువతిపై అత్యాచారయత్నం కేసులో కీలక మలుపు చోటుచేసుకుంది. యువతి పోలీసులను తప్పుదోవ పట్టించినట్లు రైల్వే ఎస్పీ చందన దీప్తి వెల్లడించారు. ఆమె సెల్‌ఫోన్‌తో ఇన్‌స్టాగ్రామ్ రీల్స్ చేస్తుండగా ప్రమాదవశాత్తు జారిపడినట్లు తెలిపారు. అయితే, తనపై అత్యాచారయత్నం జరిగినట్లు పోలీసులను నమ్మించిందని ఆమె పేర్కొన్నారు.

దర్యాప్తులో భాగంగా సుమారు 300కు పైగా సీసీ కెమెరాలను రైల్వే పోలీసులు పరిశీలించినట్లు తెలిపారు. ఈ కేసుకు సంబంధించి దాదాపు 120 మంది అనుమానితులను ప్రశ్నించామని, ఆ తర్వాత యువతిపై అత్యాచారయత్నం జరగలేదని తేల్చినట్లు వెల్లడించారు.

మేడ్చల్ మల్కాజ్‌గిరి జిల్లాలోని ఒక ప్రైవేటు సంస్థలో ఉద్యోగం చేస్తున్న యువతిపై ఒక యువకుడు ఎంఎంటీఎస్‌ రైలులో అత్యాచారానికి యత్నించినట్టు వార్తలు రావడంతో కలకలం రేగింది. కొంపల్లి సమీపంలో రైలు బ్రిడ్జి వద్ద కిందపడటంతో ఆమె గాయపడింది. ఆసుపత్రిలో చికిత్స పొందిన ఆమె ప్రస్తుతం పూర్తిగా కోలుకుంది.
Secunderabad MMTS Train Rape Case
Railway SP Chandana Deepthi
False Rape Accusation
Woman's Statement
CCTV Footage
Hyderabad Rape Case
Telangana Crime News
MMTS Train
Secunderabad
Rape Investigation

More Telugu News