Rakesh Reddy: గ్రూప్-1 పరీక్షల ఫలితాలు వచ్చేసరికి 10 మంది ఎలా పెరిగారు?: రాకేశ్ రెడ్డి

- పరీక్షలకుసంబంధించి హైకోర్టు తీర్పు టీజీపీఎస్సీకి చెంపపెట్టు అన్న రాకేశ్ రెడ్డి
- ధర్మానిదే అంతిమ విజయమని హైకోర్టు తీర్పుతో వెల్లడైందని వ్యాఖ్య
- హైకోర్టు తీర్పు పోరాడిన అభ్యర్థుల విజయమన్న రాకేశ్ రెడ్డి
గ్రూప్-1 పరీక్ష ఫలితాలలో 10 మంది అభ్యర్థులు ఎలా పెరిగారని బీఆర్ఎస్ నేత రాకేశ్ రెడ్డి ప్రశ్నించారు. ఈ పరీక్షలకు సంబంధించి తెలంగాణ హైకోర్టు ఇచ్చిన తీర్పు టీజీపీఎస్సీకి చెంపపెట్టులాంటిదని వ్యాఖ్యానించారు. ధర్మానిదే అంతిమ విజయమని హైకోర్టు తీర్పు ద్వారా స్పష్టమైందని ఆయన అన్నారు.
హైకోర్టు తీర్పు... పోరాడిన అభ్యర్థుల విజయమని, వారికి అండగా నిలిచిన బీఆర్ఎస్కు నైతిక విజయమని పేర్కొన్నారు. మెయిన్స్‌కు 21,075 మంది హాజరు కాగా, ఫలితాలు ప్రకటించే సమయానికి 21,085 మంది అభ్యర్థులు ఉన్నారని, ఈ అభ్యర్థుల సంఖ్య ఎలా పెరిగిందో చెప్పాలని నిలదీశారు.
ఇది సైబర్ నేరమా అని రాకేశ్ రెడ్డి సందేహం వ్యక్తం చేశారు. లేక, ఒక పద్ధతి ప్రకారం మార్కులు వేసినట్లు కనిపిస్తోందని అనుమానం వ్యక్తం చేశారు. గ్రూప్-1 మెయిన్స్ పరీక్షలో 21 ఉల్లంఘనలు జరిగాయని ఆరోపించారు. దీనిపై న్యాయ విచారణ లేదా సీబీఐతో విచారణ జరిపించాలని ఆయన డిమాండ్ చేశారు.