KCR: బీఆర్ఎస్ రజతోత్సవ సభ... నేతలకు కీలక సూచనలు చేసిన కేసీఆర్

KCRs Key Instructions for BRS Silver Jubilee Celebrations
  • ఈ నెల 27న ఎల్కతుర్తిలో బీఆర్ఎస్ రజతోత్సవ సభ
  • వరంగల్ జిల్లా నేతలతో ఫామ్ హౌస్ లో కేసీఆర్ భేటీ
  • సమావేశానికి హాజరైన ఎమ్మెల్సీలు కవిత, పోచంపల్లి శ్రీనివాస్ రెడ్డి
ఈ నెల 27న వరంగల్ జిల్లా ఎల్కతుర్తిలో బీఆర్ఎస్ పార్టీ రజతోత్సవ సభ జరగనున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో వరంగల్ జిల్లాకు చెందిన పలువురు నేతలు, మహిళా నేతలతో ఆ పార్టీ అధినేత కేసీఆర్ ఎర్రవెల్లిలోని ఫామ్ హౌస్ లో సమావేశమయ్యారు. 

రజతోత్సవ సభలో మహిళలకు ప్రత్యేక ఏర్పాట్లు, సభను విజయవంతం చేయడంలో వారి భాగస్వామ్యం, కార్యాచరణ, అనుసరించాల్సిన వ్యూహాలపై సూచనలు, సలహాలు ఇచ్చారు. ఈ సమావేశానికి బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత, ఎమ్మెల్సీ పోచంపల్లి శ్రీనివాస్ రెడ్డి, మాజీ విప్ దాస్యం విజయ్ భాస్కర్, మాజీ ఎమ్మెల్యేలు పెద్ది సుదర్శన్ రెడ్డి, వొడితెల సతీశ్ కుమార్, జీవన్ రెడ్డి తదితరులు హాజరయ్యారు.
KCR
BRS Party
Telangana
Warangal
Elkurthi
Silver Jubilee Celebrations
K Kavitha
Pocharam Srinivas Reddy
Dasya Vijay Bhaskar
Women's Role in Politics

More Telugu News