Sunrisers Hyderabad: ఓడిపోయినా ... అవార్డులు ఇచ్చుకున్న సన్ రైజర్స్!

Sunrisers Hyderabad Awards Despite Loss to Mumbai Indians
 
సన్ రైజర్స్ హైదరాబాద్ జట్టు నిన్న ముంబయి ఇండియన్స్ చేతిలో ఓటమిపాలవడం తెలిసిందే. ముంబయి వాంఖడే స్టేడియంలో జరిగిన ఈ మ్యాచ్ లో సన్ రైజర్స్ 4 వికెట్ల తేడాతో పరాజయం చవిచూసింది. అయినప్పటికీ, ఈ మ్యాచ్ లో కీలక ప్రదర్శన చేసిన ఆటగాళ్లకు సన్ రైజర్స్ సపోర్టింగ్ స్టాఫ్ అవార్డులు ఇచ్చి ఉత్సాహపరిచింది. 

మ్యాచ్ ముగియగానే డ్రెస్సింగ్ రూంలో ఈ అవార్డుల కార్యక్రమం నిర్వహించారు. బ్యాట్స్ మన్ అనికేత్ వర్మ 8 బంతుల్లో 18 పరుగులు చేసి అజేయంగా నిలవడాన్ని ప్రత్యేకంగా ప్రస్తావించారు. అతడికి రైజర్ ఆఫ్ ద మ్యాచ్ అవార్డు అందించారు. 

మైదానంలో పాదరసంలా కదులుతూ మెరుపు ఫీల్డింగ్ చేసిన తెలుగుతేజం నితీశ్ కుమార్ రెడ్డికి సేవర్ ఆఫ్ ద గేమ్ అవార్డు ఇచ్చారు. 

3 వికెట్లు తీసి పోరాడిన కెప్టెన్ ప్యాట్ కమిన్స్ కు ప్లేయర్ ఆఫ్ ద డే అవార్డు లభించింది. దీనికి సంబంధించిన వీడియోను సన్ రైజర్స్ హైదరాబాద్ సోషల్ మీడియాలో పంచుకుంది.
Sunrisers Hyderabad
Mumbai Indians
IPL 2023
Ankit Varma
Nitish Kumar Reddy
Pat Cummins
Wankhede Stadium
Rising of the Match
Saver of the Game
Player of the Day

More Telugu News