Shine Tom Chacko: 'నార్కోటిక్స్' రైడ్‌... పోలీసుల విచార‌ణ‌కు హాజ‌రైన‌ ప్ర‌ముఖ న‌టుడు

Shine Tom Chacko Appears Before Police in Narcotics Case
  • పోలీసుల విచార‌ణ‌కు హాజ‌రైన న‌టుడు షైన్ టామ్ చాకో
  • ఈరోజు త‌న న్యాయ‌వాదితో క‌లిసి ఎర్నాకులం పీఎస్‌కు వెళ్లిన న‌టుడు
  • ఇటీవ‌ల కొచ్చిలోని ఓ హోట‌ల్‌పై డ్ర‌గ్స్ నేప‌థ్యంలో 'నార్కోటిక్స్' రైడ్ 
  • చాకో అక్క‌డి నుంచి ప‌రారైన‌ట్లు వార్త‌లు 
  • ఈ విష‌యంతో పాటు డ్ర‌గ్స్‌ వినియోగంపై ఆయ‌న‌ను పోలీసులు ప్రశ్నించే అవ‌కాశం
ప్ర‌ముఖ మ‌ల‌యాళ న‌టుడు షైన్ టామ్ చాకో ఈరోజు పోలీసుల విచార‌ణ‌కు హాజ‌ర‌య్యారు. త‌న న్యాయ‌వాదితో క‌లిసి ఇవాళ ఉద‌యం 10 గంట‌ల‌కు ఎర్నాకులం పీఎస్‌కు వెళ్లారు. ఇటీవ‌ల ఓ హోట‌ల్‌పై  'నార్కోటిక్స్' రైడ్ జ‌రిగిన స‌మ‌యంలో ఆయ‌న అక్క‌డి నుంచి ప‌రారైన‌ట్లు వార్త‌లు వ‌చ్చిన విష‌యం తెలిసిందే. ఈ విష‌యంతో పాటు మాద‌క ద్ర‌వ్యాల వినియోగంపై చాకోను పోలీసులు ప్రశ్నించే అవ‌కాశం ఉంద‌ని స‌మాచారం. 

ఇక కొచ్చిలోని ఓ హోట‌ల్‌లో డ్ర‌గ్స్ తీసుకుంటున్నార‌నే స‌మాచారంతో నార్కోటిక్ సిబ్బంది రైడ్ చేసింది. అయితే, పోలీసులు అక్క‌డికి రావ‌డానికి కొద్దిసేప‌టి ముందే షైన్ టామ్ చాకో అక్క‌డి నుంచి పారిపోయిన‌ట్లు వార్త‌లు వ‌చ్చాయి. ఆ స‌మ‌యంలో ఆ హోట‌ల్‌ మూడో అంత‌స్తులో ఉన్న ఆయ‌న‌... కిటికీ ద్వారా సెకండ్ ఫ్లోర్‌లోకి దూకి మెట్ల మార్గంలో ప‌రుగులు పెట్టారు. ఇందుకు సంబంధించిన దృశ్యాలు అక్క‌డి సీసీటీవీ కెమెరాల్లో రికార్డ‌య్యాయి. ఆ వీడియో బ‌య‌ట‌కు రావ‌డంతో నెట్టింట వైర‌ల్‌గా మారింది. 

మ‌రోవైపు చాకోపై న‌టి విన్సీ అలోషియస్ తీవ్ర ఆరోపణలు చేశారు. ఆయ‌న‌ డ్రగ్స్ మ‌త్తులో ఉన్నప్పుడు త‌న‌తో అనుచితంగా ప్రవర్తించాడని ఆమె మలయాళం మూవీ ఆర్టిస్ట్స్ అసోసియేషన్ (AMMA)లో ఫిర్యాదు కూడా చేశారు.
Shine Tom Chacko
Malayalam Actor
Drugs Case
Police Investigation
Kochi Hotel Raid
Narcotics
Drug Abuse
Vincy Alocious
AMMA Complaint
Kerala Police

More Telugu News