Kurasala Kannababu: కుట్రలు, కుతంత్రాలతో విశాఖ మేయర్ పీఠాన్ని కైవసం చేసుకున్నారు: కురసాల కన్నబాబు

Visakhapatnam Mayor Post Captured Through Conspiracy Kurasala Kannababu
  • మేయర్ ను కూటమి ప్రభుత్వం అప్రజాస్వామికంగా గద్దె దించిందన్న కన్నబాబు
  • కూటమి పాలనలో అధర్మం రాజ్యమేలుతోందని విమర్శ
  • విలువలు లేని వ్యక్తి చంద్రబాబు అని మండిపాటు
విశాఖ మేయర్ పీఠాన్ని కూటమి కైవసం చేసుకున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో కూటమి ప్రభుత్వంపై వైసీపీ నేతలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. 

ప్రజాస్వామ్యాన్ని కూటమి ఖూనీ చేసిందని వైసీపీ ఉత్తరాంధ్ర రీజనల్ కోఆర్డినేటర్ కురసాల కన్నబాబు అన్నారు. కుట్రలు, కుతంత్రాలతో మేయర్ పీఠాన్ని కైవసం చేసుకున్నారని విమర్శించారు. యాదవ మహిళకు మేయర్ పదవిని జగన్ ఇచ్చారని... ఆమెను అప్రజాస్వామికంగా కూటమి ప్రభుత్వం గద్దె దించిందని మండిపడ్డారు. 

చావుబతుకుల మధ్య కూటమి సర్కార్ మ్యాజిక్ ఫిగర్ కు చేరుకుందని కన్నబాబు ఎద్దేవా చేశారు. కూటమి పాలనలో అధర్మం రాజ్యమేలుతోందని అన్నారు. కూటమి నేతలకు గెలిచే బలం లేకపోయినా అవిశ్వాస తీర్మానం పెట్టారని... కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి గెలిచారని దుయ్యబట్టారు. 

విలువలు, విశ్వసనీయత లేని వ్యక్తి చంద్రబాబు అని మండిపడ్డారు. కూటమిని తట్టుకుని నిలబడ్డ వైసీపీ కార్పొరేటర్లకు చేతులెత్తి మొక్కుతున్నామని అన్నారు.
Kurasala Kannababu
Visakhapatnam Mayor
YCP
TDP
Andhra Pradesh Politics
Mayor Election
Coalition Government
Political Conspiracy
Corruption allegations

More Telugu News