Smiley Face: ఈ నెల 25న ఖ‌గోళంలో ఆవిష్కృతం కానున్న మ‌హాద్భుతం

Witness the Amazing Celestial Smiley Face on April 25th
  • శుక్రుడు, శ‌ని, నెల‌వంక అతి స‌మీపంలోకి రానుండ‌టంతో ఏర్ప‌డ‌నున్న 'స్మైలీ ఫేస్'
  • ఈ మేరకు సైన్స్ వెబ్‌సైట్ 'లైవ్‌సైన్స్' వెల్ల‌డి
  • ఈ అద్భుత దృశ్యాన్ని ప్ర‌పంచంలో ఎక్క‌డినుంచైనా వీక్షించే అవ‌కాశం
ఈ నెల 25న గ‌గ‌న‌త‌లంలో ఓ అంద‌మైన‌, మ‌హా అద్భుతం ఆవిష్కృతం కానుంది. సౌర‌కుటుంబంలోని రెండు గ్ర‌హాలు, నెల‌వంక (చంద్రుడు) స‌మీపంలోకి రానుండ‌టంతో గ‌గ‌న‌త‌లంలో 'స్మైలీ ఫేస్' ఏర్ప‌డ‌నుంది. ఈ మేరకు సైన్స్ వెబ్‌సైట్ 'లైవ్‌సైన్స్' వెల్ల‌డించింది. 

ఏప్రిల్ 25న తెల్ల‌వారుజాముకు ముందు శుక్రుడు, శ‌ని... చందమామ (నెల‌వంక‌)కు అతి స‌మీపంలోకి రానున్నాయి. ఒక ద‌గ్గ‌రే క‌నిపించ‌నున్న ఆ మూడు... 'స్మైలీ ఫేస్' ఆకృతిని ప్ర‌తిబింబించ‌నున్నాయి. సూర్యోద‌యానికి ముందు అతి త‌క్కువ స‌మ‌యం మాత్ర‌మే క‌నిపించ‌నున్న ఈ అద్భుత దృశ్యాన్ని ప్ర‌పంచంలో ఎక్క‌డినుంచైనా వీక్షించేందుకు అవ‌కాశం ఉంది. 

రెండు గ్ర‌హాలు న‌య‌నాలుగా, నెల‌వంక చిరున‌వ్వుతో ఉన్న పెదాలుగా క‌నిపించ‌నుంది. ఈ వివ‌రాల‌ను అమెరికా అంత‌రిక్ష సంస్థ నాసా సోలార్ సిస్ట‌మ్‌ అంబాసిడ‌ర్ బ్రెండా క‌ల్‌బ‌ర్ట్స‌న్ వెల్ల‌డించారు. శుక్రుడు, శ‌ని ప్ర‌కాశ‌వంతంగా ఉండ‌డంతో వాటిని మాములుగా వీక్షించ‌వ‌చ్చు. అయితే, స్మైల్ ఇమేజ్‌ను చూసేందుకు మాత్రం స్టార్‌గేజింగ్ బైనాక్యుల‌ర్, టెలిస్కోప్ అవ‌స‌రం కానున్నాయి.    


Smiley Face
Brenda Calbert
NASA
Venus
Saturn
Moon
Smiling Face
Planetary Alignment
April 25th
Astronomy
Stargazing

More Telugu News