Nishikant Dubey: సుప్రీంకోర్టు ఉత్తర్వులు... తీవ్రంగా స్పందించిన బీజేపీ ఎంపీ

BJP MP Nishikant Dubeys Strong Reaction to Supreme Court Order
  • వక్ఫ్ సవరణ చట్టం, బిల్లులపై రాష్ట్రపతికి సుప్రీంకోర్టు గడువు
  • సుప్రీంకోర్టు చట్టాలు చేస్తే పార్లమెంటు భవనాన్ని మూసివేయాలన్న బీజేపీ ఎంపీ
  • రాష్ట్రపతికి గడువు నిర్దేశించేలా న్యాయవ్యవస్థ వ్యవహరించడం సరికాదన్న ఎంపీ
వక్ఫ్ సవరణ చట్టం-2025 బిల్లులపై రాష్ట్రపతికి గడువు విషయంలో సుప్రీంకోర్టు ఇచ్చిన ఉత్తర్వులపై బీజేపీ ఎంపీ నిషికాంత్ దుబే స్పందించారు. సుప్రీంకోర్టే చట్టాలు చేసేట్టయితే, ఇక పార్లమెంటు భవనాన్ని మూసేసుకోవాల్సి ఉంటుందని ఆయన ఘాటుగా వ్యాఖ్యానించారు. ఈ మేరకు ఆయన తన 'ఎక్స్' ఖాతాలో ఈ విషయాన్ని రాసుకొచ్చారు.

రాష్ట్రపతికి గడవు నిర్దేశించేలా న్యాయవ్యవస్థ వ్యవహరించడం సరికాదని ఉపరాష్ట్రపతి జగదీప్ ధన్‌ఖడ్ ఇదివరకే అన్నారు. సుప్రీంకోర్టు ఇచ్చిన ఉత్తర్వులపై బీజేపీ నేతల నుంచి అభ్యంతరాలు వ్యక్తమవుతున్నాయి.

రాష్ట్రాల శాసనసభలు ఆమోదించిన బిల్లులకు సమ్మతి తెలపడానికి రాష్ట్రపతికి, గవర్నర్లకు మూడు నెలల గడువు విధిస్తూ సుప్రీంకోర్టు తీర్పు వెలువరించింది. గవర్నర్ పంపిన బిల్లులను రాష్ట్రపతి ఎటూ తేల్చకపోతే అప్పుడు రాష్ట్రాలు నేరుగా తమను ఆశ్రయించవచ్చని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. ఈ పరిణామాలపై బీజేపీ స్పందించింది.
Nishikant Dubey
BJP MP
Supreme Court
President's Assent
Bills
Three-Month Deadline
Governor
Parliament
Jagdeep Dhankhar
Wakf Amendment Act 2025

More Telugu News