Aiden Markram: మార్క్రమ్, బదోనీ ఫిఫ్టీలు... సమద్ సుడిగాలి ఇన్నింగ్స్

Markram Badoni fifties and Samads blitz helps LSG to 180
  • ఐపీఎల్ లో లక్నో సూపర్ జెయింట్స్ × రాజస్థాన్ రాయల్స్
  • టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న లక్నో
  • 20 ఓవర్లలో 5 వికెట్లకు 180 పరుగులు
ఐపీఎల్ లో ఇవాళ లక్నో సూపర్ జెయింట్స్, రాజస్థాన్ రాయల్స్ ఆడుతున్నాయి. టాస్ గెలిచిన లక్నో జట్టు బ్యాటింగ్ ఎంచుకుంది. ఓపెనర్ ఐడెన్ మార్క్రమ్, ఆయుష్ బదోనీ అర్ధసెంచరీలు సాధించగా... సమద్ సుడిగాలి ఇన్నింగ్స్ ఆడాడు. దాంతో నిర్ణీత 20 ఓవర్లలో లక్నో సూపర్ జెయింట్స్ 5 వికెట్లకు 180 పరుగులు చేసింది. 

మరో ఓపెనర్ మిచెల్ మార్ష్ 4 పరుగులకే అవుటైనా, మార్క్రమ్ ధాటిగా ఆడాడు. ఈ సౌతాఫ్రికా బ్యాటర్ 45 బంతుల్లో 5 ఫోర్లు, 3 సిక్సులతో 66 పరుగులు చేశాడు. యంగ్ ప్లేయర్ ఆయుష్ బదోని 34 బంతుల్లో 5 ఫోర్లు, 1 సిక్స్ తో సరిగ్గా 50 పరుగులు చేసి తుషార్ దేశ్ పాండే బౌలింగ్ లో అవుటయ్యాడు. 

చివర్లో అబ్దుల్ సమద్ 10 బంతుల్లోనే అజేయంగా 30 పరుగులు చేశాడు. సమద్ స్కోరులో 4 భారీ సిక్సులున్నాయి. నికోలాస్ పూరన్ (11), కెప్టెన్ రిషబ్ పంత్ (3) మరోసారి విఫలమయ్యారు. రాజస్థాన్ రాయల్స్ బౌలర్లలో హసరంగ 2, ఆర్చర్ 1, సందీప్ శర్మ 1, తుషార్ దేశ్ పాండే 1 వికెట్ తీశారు.
Aiden Markram
Ayush Badoni
Abdul Samad
IPL 2023
Lucknow Super Giants
Rajasthan Royals
Cricket
T20 Cricket
Half-centuries
IPL Match

More Telugu News