Shine Tom Chacko: అరెస్టయిన కొన్ని గంటల్లోనే మలయాళ నటుడికి బెయిల్

Shine Tom Chacko Granted Bail Hours After Arrest in Drugs Case
  • డ్రగ్స్ కేసులో మలయాళ నటుడు షైన్ టామ్ చాకో అరెస్టు
  • పోలీసులు న్యాయస్థానం ముందు హజరుపర్చగా బెయిల్ మంజూరు చేసిన న్యాయమూర్తి
  • కోర్టు బెయిల్ మంజూరు చేయడంతో కొన్ని గంటల వ్యవధిలోనే బయటకు వచ్చిన షైన్ టామ్ చాకో
డ్రగ్స్ కేసులో అరెస్టైన మలయాళ నటుడు షైన్ టామ్ చాకోకు భారీ ఊరట లభించింది. పోలీసులు అరెస్టు చేసిన కొన్ని గంటల వ్యవధిలోనే ఆయన బయటకు వచ్చేశారు. చాకోకు కోర్టు బెయిల్ మంజూరు చేయడంతో పోలీసులు ఆయన్ను విడుదల చేశారు.

సహనటి విన్సీ ఇటీవల షైన్ టామ్ చాకోపై తీవ్ర ఆరోపణలు చేయడం సంచలనమైంది. డ్రగ్స్ మత్తులో చాకో తన పట్ల అసభ్యకరంగా ప్రవర్తించాడంటూ ఆమె సంచలన ఆరోపణలు చేసింది. ఈ ఆరోపణలు ఎదుర్కొంటున్న సమయంలోనే ఈ నెల 16న ఓ డ్రగ్స్ కేసులో నిందితుడిని పట్టుకునేందుకు పోలీసులు కొచ్చిలోని కలూర్ లో గల స్టార్ హోటల్‌పై తనిఖీకి వెళ్లారు. అయితే ఆ సమయంలో హోటల్ రూమ్‌లో డ్రగ్స్ నిందితుడితో పాటు షైన్ టామ్ చాకో కూడా ఉన్నారు.

పోలీసులు వస్తున్నారన్న సమాచారం తెలియడంతో చాకో హోటల్ కిటికీ నుంచి దూకి పారిపోయారు. చాకో హోటల్ నుంచి పారిపోతున్న దృశ్యాలు అక్కడి సీసీ కెమెరాలో రికార్డయ్యాయి. దీంతో ఆ తర్వాత పోలీసులు షైన్ టామ్ చాకోను అదుపులోకి తీసుకుని విచారించారు. సదరు నిందితుడితో తనకు పరిచయం ఉందని షైన్ టామ్ చాకో పోలీసుల విచారణ సందర్భంలో అంగీకరించారు.

దీంతో పోలీసులు ఆయన్ను అరెస్టు చేసి కోర్టు ముందు హాజరుపరిచారు. అయితే కోర్టు ఆయనకు బెయిల్ మంజూరు చేయడంతో వెంటనే బయటకు వచ్చేశారు. అయితే, పోలీసుల అదుపులో ఉన్న సమయంలోనే షైన్ టామ్ చాకో నుండి నమూనాలు సేకరించి డ్రగ్స్ పరీక్షల కోసం ల్యాబ్‌కు పంపారు. ఆ నివేదిక వస్తే షైన్ టామ్ చాకో డ్రగ్స్ తీసుకుంటున్నారా లేదా అనేది వెల్లడికానుంది. 
Shine Tom Chacko
Malayalam Actor
Drugs Case
Arrest
Bail
Kochi
Hotel
Police
Actress Vincy
Drug Abuse

More Telugu News