AP Mega DSC 2025: ఏపీ మెగా డీఎస్సీ నోటిఫికేష‌న్ విడుద‌ల‌

AP Mega DSC Notification Released FOR 16347 Teacher Vacancies
  • 16,347 టీచ‌ర్‌ పోస్టుల భ‌ర్తీకి డీఎస్సీ నోటిఫికేష‌న్ రిలీజ్‌
  • పాఠ‌శాల విద్యాశాఖ నోటిఫికేష‌న్ విడుద‌ల చేసింద‌న్న‌ మంత్రి లోకేశ్‌
  • ఈ మేర‌కు ‘ఎక్స్’ వేదిక‌గా నారా లోకేశ్‌ పోస్ట్‌
ఏపీ ప్ర‌భుత్వం మెగా డీఎస్సీ-2025 నోటిఫికేష‌న్‌ను విడుదల చేసింది. రాష్ట్రంలో 16,347 ఉపాధ్యాయ పోస్టుల భ‌ర్తీకి పాఠ‌శాల విద్యాశాఖ తాజాగా నోటిఫికేష‌న్ విడుద‌ల చేసింద‌ని మంత్రి నారా లోకేశ్ ‘ఎక్స్’ ద్వారా వెల్లడించారు. ఈ మేర‌కు నోటిఫికేష‌న్ షెడ్యూల్‌ను కూడా ఆయ‌న పంచుకున్నారు. ఆన్‌లైన్ దరఖాస్తు ప్ర‌క్రియ ప్రారంభ‌మైంద‌ని లోకేశ్ పేర్కొన్నారు. 

దరఖాస్తు పోర్టల్స్ (https:// cse.ap.gov.in, https:// apdsc.apcfss.in)తో పాటు సజావుగా దరఖాస్తు ప్రక్రియ కోసం ఒక‌ వీడియోను షేర్ చేశారు. ఈ సంద‌ర్భంగా ఆశావహులందరికీ మంత్రి లోకేశ్‌ హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియ‌జేశారు.

ఇక మెగా డీఎస్సీకి సంబంధించిన పూర్తి స‌మాచారం, ప‌రీక్షా షెడ్యూల్‌, సిల‌బ‌స్‌, టీచ‌ర్ పోస్టుల వివ‌రాలు, సంబంధిత జీఓలు, స‌హాయ‌ కేంద్రాల వివ‌రాలు పాఠ‌శాల విద్యాశాఖ వెబ్‌సైట్‌లో ఇవాళ ఉద‌యం 10 గంట‌ల నుంచి అందుబాటులో ఉంచిన‌ట్లు డైరెక్ట‌ర్ విజ‌య‌రామ‌రాజు వెల్ల‌డించారు. 

ఏపీ మెగా డీఎస్సీ షెడ్యూల్ ఇలా..
  • నేటి నుంచి మే 15 వరకు ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తుల స్వీకరణ, ఫీజుల చెల్లింపు
  • మే 30 నుంచి హాల్ టికెట్లు డౌన్‌లోడ్ చేసుకోవచ్చు
  • జూన్ 6 నుంచి జులై 6 వరకు పరీక్షల నిర్వహణ‌
  • పరీక్షలన్నీ పూర్తయిన తర్వాత రెండో రోజున ప్రాథమిక ‘కీ’ విడుదల
  • ఆ తర్వాత వారం రోజులపాటు అభ్యంతరాల స్వీకర‌ణ‌
  • ఆ తర్వాత ఏడు రోజులకు ఫైనల్ ‘కీ’ విడుదల 
  • అనంతరం వారం రోజులకు మెరిట్ జాబితా రిలీజ్‌
AP Mega DSC 2025
Nara Lokesh
Andhra Pradesh
Teacher Recruitment
Mega DSC Notification
AP School Education Department
16347 Teacher Posts
Online Application
AP DSC Exam Schedule
Education Jobs Andhra Pradesh

More Telugu News