Chandrababu Naidu: ఏపీ సీఎం చంద్రబాబుకు ప్రధాని మోదీ జన్మదిన శుభాకాంక్షలు

––
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబుకు ప్రధాని నరేంద్ర మోదీ ట్విట్టర్ వేదికగా పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపారు. ‘మిత్రుడు, ఏపీ సీఎం చంద్రబాబుకు జన్మదిన శుభాకాంక్షలు. ఏపీని అభివృద్ధి పథంలో నడిపేందుకు ఆయన అవిశ్రాంతంగా కృషి చేస్తున్నారు. భవిష్యత్ రంగాలపై దృష్టి సారించి రాష్ట్రాన్ని ముందుకు నడిపిస్తున్నారు. ఆయనకు దీర్ఘాయుష్షు, ఆరోగ్యకరమైన జీవితం ప్రసాదించాలని ప్రార్థిస్తున్నా’ అని ప్రధాని నరేంద్ర మోదీ పేర్కొన్నారు.