Ponnam Prabhakar: త్వరలో ఆర్‌టీసీలో 3,038 ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్: మంత్రి పొన్నం

టీజీఆర్‌టీసీలో ఖాళీగా ఉన్న పోస్టులను త్వరలోనే భర్తీ చేస్తామని మంత్రి పొన్నం ప్రభాకర్ వెల్లడించారు. అతి త్వరలోనే 3,038 ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ జారీ చేస్తామన్నారు. వీటిలో డ్రైవర్-2,000, శ్రామిక్స్-743, డిప్యూటీ సూపరింటెండెంట్ (మెకానిక్)-114, డిప్యూటీ సూపరింటెండెంట్ (ట్రాఫిక్)-84, డిపో మేనేజర్/ అసిస్టెంట్ ట్రాఫిక్ మేనేజర్-25, అసిస్టెంట్ ఇంజనీర్ (సివిల్)-23, అసిస్టెంట్ మెకానికల్ ఇంజనీర్-15, సెక్షన్ ఆఫీసర్ (సివిల్)-11, మెడికల్ ఆఫీసర్ (జనరల్)-07, మెడికల్ ఆఫీసర్ (స్పెషలిస్ట్)-07, అకౌంట్స్ ఆఫీసర్-06 పోస్టులు ఉన్నాయని మంత్రి తెలిపారు.