Chandrababu Naidu: చంద్రబాబు నిజమైన టైమ్ ట్రావెలర్.. ఎవరైనా అంగీకరించాల్సిందే!: డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణరాజు

Chandrababu Naidu A True Time Traveler Says Deputy Speaker Raghu Rama Krishna Raju
  • నేడు చంద్రబాబు జన్మదినం
  • అసెంబ్లీ హాల్ లో చంద్రబాబు ప్రసంగాల పుస్తకం ఆవిష్కరణ
  • హాజరైన రఘురామకృష్ణరాజు
  • చంద్రబాబు భవిష్యత్తును ముందుగానే ఊహించగలరని కితాబు
నేడు ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు పుట్టినరోజు సందర్భంగా  అసెంబ్లీ హాల్ లో జరిగిన చంద్రబాబు ప్రసంగాల పుస్తకం ఆవిష్కరణ కార్యక్రమానికి డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణరాజు కూడా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, చంద్రబాబు విజన్‌ను ఎంతటి వ్యతిరేకులైనా అంగీకరించాల్సిందేనని అన్నారు. భవిష్యత్తును ముందుగానే ఊహించగల నిజమైన 'టైమ్ ట్రావెలర్' చంద్రబాబు అని అభివర్ణించారు. 

మహాత్మా గాంధీలోని ఓర్పు, సుభాష్ చంద్రబోస్‌లోని విప్లవ ధోరణి చంద్రబాబులో కనిపిస్తాయని, అయితే సహనం, ఓర్పు ఎక్కువగా ప్రదర్శిస్తూ అప్పుడప్పుడు విప్లవ స్ఫూర్తిని కూడా చూపిస్తారని వ్యాఖ్యానించారు. విదేశాల్లో ఉన్నా కూడా వీడియో, టెలికాన్ఫరెన్సుల ద్వారా రాష్ట్ర వ్యవహారాలను సమీక్షిస్తారని, ఆయన పనితీరు అలాంటిదని రఘురామ వివరించారు. ఇంతటి గొప్ప నాయకుడితో కలిసి పనిచేసే అవకాశం రావడం ఆలస్యమైనా, ఇప్పుడు లభించడం పట్ల సంతోషం వ్యక్తం చేశారు. విజనరీ లీడర్‌కు జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తున్నానని వెల్లడించారు.

చంద్రబాబు తత్వాన్ని అర్థం చేసుకున్న వారు ఎవరైనా గొప్పగా రాణిస్తారని ఆయన అన్నారు. దురభిమానులు కాకుండా, మంచి అభిమానులు కలిగిన ఏకైక నాయకుడు చంద్రబాబు అని తాను చాలామందికి చెప్పానని వివరించారు. పార్టీలోని నాయకులంతా చంద్రబాబు వ్యక్తిత్వాన్ని ప్రేమిస్తారని పేర్కొన్నారు. 

చంద్రబాబుకు సమయపాలనపై అంత పట్టింపు ఉండదేమోనని తాను కూడా మొదట్లో భావించానని, కానీ దాని వెనుక ఉన్న కారణాన్ని తర్వాత గ్రహించానని రఘురామ తెలిపారు. చిన్నవారు చెప్పే కొత్త విషయాలను సైతం ఎంతో శ్రద్ధగా వింటారని, ఆ క్రమంలో సమయాన్ని కూడా మరచిపోతారని, ఆయనొక నిత్య విద్యార్థి అని కొనియాడారు. ఈ నేర్చుకునే తత్వం వల్ల ఒకరిద్దరికి సమయం విషయంలో ఇబ్బంది కలిగినా, రాష్ట్రానికి మాత్రం భవిష్యత్తులో ఎంతో మేలు జరుగుతుందని స్పష్టం చేశారు.

Chandrababu Naidu
Deputy Speaker Raghurama Krishnaraju
Andhra Pradesh
AP Assembly
Visionary Leader
Time Traveler
Birthday
Book Launch
Leadership Qualities
Political News

More Telugu News